ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్ తేడాతో బంగ్లాను ఓడించింది. అన్ని ఫార్మాట్లలో భారత ఆధిపత్యం చలాయించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు అల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. తరువాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ వికెట్ కోల్పోయింది భారత్. ఆ ఆనందం బంగ్లాకు ఎక్కువసేపు ఉండలేదు. తరువాత వచ్చిన పుజారా మయాంక్ తో కలిసి బంగ్లాపై అటాకింగ్ గేమ్ ఆడాడు. తరువాత కోహ్లీ డక్ అవుట్ అయినా అప్పటికే భారత మంచి స్థితిలో ఉండడం జరిగింది. 


తరువాత మయాంక్, రహానే బంగ్లాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో మయాంక్ సిక్స్ కొట్టి మరో ద్విశతకం బడేసాడు. ఈ టెస్ట్ లో మయాంక్ చూడచక్కనైన షాట్ లతో ఆకట్టుకున్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయాడు. శతకాన్ని రహానే తృటిలో చేజార్చుకున్నాడు. తరువాత వచ్చిన జడేజా తనదైన శైలి రెచ్చిపోవడంతో భారి ఆధిక్యంతో రోజును ముగించింది భారత్. 


మూడో రోజు భారత్ బ్యాటింగ్ చేయకుండా 493 - 6 వద్ద డిక్లేర్ చేసి 343 పరుగులు ఆధిక్యం సాధించింది. బంగ్లాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాకు ఆదిలోనే షాక్ మీద షాక్ తగిలింది. భారత్ పేస్ బౌలర్లు ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ల నిప్పులు చెరిగే వేశారు. ఆ బంతులకు వారి దగ్గర సమాధానమే లేకపోవడంతో పెవిలియన్ కి క్యూ కట్టారు. మొదటి రెండు వికెట్లు తీసి ఉమేష్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.

బంగ్లాను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తరువాత కూడా బంగ్లా ఏమాత్రం నిలవలేకపోయింది. రహీమ్, మెహిదీ హాసన్ కొద్దీ సేపు పోరాడిన మిగిలిన బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. రహీమ్ ఒక్కడు అర్థ సెంచరీ చేసాడు. స్కోర్ వివరాలకు  వస్తే  బాంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 150 భారత్ మొదటి ఇన్నింగ్స్: 493 - 6 డిక్లేర్డ్, బంగ్లా రెండో ఇన్నింగ్స్: 213 హైలైట్: మయాంక్ డబుల్ సెంచరీ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: