ఈడెన్ గార్డెన్స్ వేదికగా  మొదటి సారి  డే  అండ్ నైట్  టెస్టు  మ్యాచ్  గెల్చుకొని  చరిత్ర సృష్టించింది భారత్.  మూడు  రోజులు  కూడా  సాగని  ఈ మ్యాచ్  లో ఇన్నింగ్స్  46పరుగులతో  ఓడిపోయి అవమానకర రీతిలో పర్యటనను ముగించింది బంగ్లాదేశ్.  ఇరు జట్ల మధ్య  టీ 20 సిరీస్ రసవత్తరంగా  జరుగుగా .. టెస్టు సిరీస్  మాత్రం  ఏకపక్షంగా సాగింది.. ఫలితంగా  బంగ్లా టెస్టు సిరీస్ లో 2-0  తో భారత్  చేతిలో వైట్ వాష్ కు గురైయింది.   

 
ఇక కోల్ కత్తా టెస్టు  గెలిచిన అనంతరం టీమిండియా సారథి  విరాట్ కోహ్లీ  చేసిన  పనికి   క్రికెట్  అభిమానులు ఫిదా అయ్యారు.  గంగూలీ , నజముల్  హాసన్ ల చేతుల మీదుగా  ట్రోఫీని  అందుకున్న  కోహ్లీ  వెంటనే    దాన్ని యువవికెట్ కీపర్ , తెలుగు తేజం  కేఎస్ భరత్ కు అందించాడు. నిజానికి  భరత్  , బంగ్లా తో టెస్టు  సిరీస్ కు ఎంపిక కాలేదు. కానీ  సాహా కు బ్యాక్  అప్ ఉంచడానికి  మేనేజ్మెంట్ చివరి నిమిషంలో  భరత్ ను  రప్పించింది.  నిన్న భరత్  టీం తో చేరాడు.   
 
 
ఇక  ఈ సిరీస్ విజయం తో భారత్  ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్  పాయింట్ల  పట్టికలో 360 పాయింట్ల తో ఎవరికి  అంతనంద దూరాన  నిలిచింది.   ఈ ఛాంపియన్ షిప్ ట్రోఫీ లో  ఒక్క  ఓటమి కూడా  లేకుండా దూసుకుపోతుంది  టీమిండియా.  

మరింత సమాచారం తెలుసుకోండి: