కేవలంమూడు , నాలుగు మ్యాచ్ లలో  ఫెయిల్ అయినందుకు  ఫ్రాంచైజీ  నన్ను  భారం అనుకుంటుందని కనీస మర్యాద కూడా  ఇవ్వడం లేదని  మాజీ విండీస్  క్రికెటర్ , విధ్వంసక  వీరుడు  క్రిస్ గేల్ ఆవేదన వ్యక్తం చేశాడు.  ప్రస్తుతం  సౌతాఫ్రికా లో జరుగుతున్న  ఏం ఎస్ ఎల్  లీగ్ లో తేష్వనే స్పార్టాన్  జట్టుకు   ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఆరు మ్యాచ్ ల్లో కలిపి ఈ సీజన్ లో  101 పరుగులు మాత్రమే  చేయగలిగాడు. దాంతో  ఫ్రాంచైజీ  గేల్  ను పట్టించుకోవడం మానేసింది. 

 

 
పొట్టి ఫార్మట్ లీగ్ ల్లో   క్రిస్ గేల్  ఓ లెజెండ్ ఆటగాడు. ఇప్పటికే  ఐపీఎల్  , తదితర  లీగుల్లో తానేంటో నిరూపించుకున్నాడు.  దాదాపు   అన్ని లీగు ల్లో  గేల్ సక్సెస్ అవుతూ వస్తున్నాడు.  అయితే ప్రస్తుతం  జరుగుతున్న ఏం ఎస్ ఎల్ టోర్నమెంట్ లో  మాత్రం గేల్  దారుణంగా  నిరాశపరిచాడు. దాంతో  అటు ఫ్రాంచైజీ , అభిమానులు కూడా తనను లెక్క చేయడం లేదని , కేవలం మూడు , నాలుగు మ్యాచ్ ల్లో   విఫలమైతే  జట్టుకు  నేను  భారంగా  కనిపిస్తున్నాను.  కొన్నేళ్లుగా  ఫ్రాంచైజీ క్రికెట్ లో ఈపరిస్థితి ని గమనిస్తున్నాను.  మూడు , నాలుగు మ్యాచ్ లో  నేను  స్కోర్  చేయలేకపోతే  నా పని అయిపోయిందనుకుంటున్నారు. ప్రజలు  కూడా  నన్ను గుర్తుంచుకోవడం లేదు  నాకు ఎలాంటి  గౌరవం  ఇవ్వడం లేదని  గేల్  మీడియా ముందు  వాపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: