ఈ తరం బ్యాట్సమెన్లో ఎవరు గొప్ప అంటే టక్కున విరాట్ కోహ్లీ అని చెప్తారు. కానీ టెస్టులో విరాట్ కి సవాలు విసిరే వాడు స్టీవ్ స్మిత్ ఒక్కడే. మూడు ఫార్మాట్లు కలిపి చుస్తే విరాట్ కి  తిరుగు ఉండదు. కానీ టెస్టులో మాత్రమే స్మిత్ గొప్ప నే చెప్పాలి. బాల్ టాంపరింగ్తో ఒక సంవత్సరం నిషేధం అనుభవించిన స్మిత్ విరాట్ కి తన మొదటి ర్యాంక్ కొలిపోయాడు. మొన్న జరిగిన యాషెస్ సిరీస్ లో స్మిత్ తిరిగి తన మొదటి ర్యాంక్ ని విరాట్ నుంచి లాగేసుకున్నాడు.

 

 తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన డే నైట్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి మరింతగా చేరువయ్యాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

 

ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 రేటింగ్ పాయింట్లు)తో రెండో స్థానంలో నిలవగా... ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(931) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 136 పరుగులతో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.ఫలింతగా 25 పాయింట్ల వ్యత్యాసాన్ని కోహ్లీ తగ్గించాడు. టాప్-10లో నిలిచిన భారత నాలుగో బ్యాట్స్‌మెన్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

 

ఛటేశ్వర్ పుజారా(791), అజ్యింకె రహానే(759) పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. డే నైట్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు తమ కెరీర్‌లో అత్యధిక పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఇషాంత్ శర్మ(716) పాయింట్లతో 17వ స్థానంలో నిలవగా, ఉమేశ్ యాదవ్(672) పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాడు. జులై 2011లో ఇషాంత్ శర్మ తొలిసారి ఏడో స్థానంలో నిలిచి కెరీర్ అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: