కేరళ  యువ వికెట్ కీపర్  సంజు శాంసన్  పట్ల  సెలక్షన్ కమిటీ  ప్రవర్తిస్తున్న తీరు పట్ల   టీమిండియా అభిమానులు  దుమ్మెత్తిపోస్తున్నారు.  దేశవాలీ క్రికెట్ లో రాణిస్తున్న కూడా  సంజు  ను ఎంపిక చేయకపోవడాన్ని  తీవ్రంగా  తప్పు బడుతునన్నారు. ఇటీవల   బంగ్లాదేశ్ తో జరిగిన  టీ 20 సిరీస్ కు   శాంసన్ ను ఎంపిక చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం  ఇవ్వకుండా  బెంచ్ కే పరిమితం చేసింది  మేనేజ్మెంట్.  
 
 
అయితే వచ్చే  వెస్టిండీస్  తో జరిగే  సిరీస్ లోనైనా శాంసన్ తుది జట్టులో అవకాశం వస్తుందనుకున్నాడు కానీ  సెలక్షన్ కమిటీ అనాలోచిత నిర్ణయంతో  శాంసన్ ను మొత్తానికే  ఆ సిరీస్ నుండి తప్పించింది.  దాంతో  అభిమానులు  , మాజీ క్రికెటర్ల నుండి పెద్ద ఎత్తున  విమర్శలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు  బీసీసీఐ  ఒత్తిడి కి తలొగ్గి వెస్టిండీస్  తో  జరిగే మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ కు  సంజు శాంసన్ ను ఎంపిక చేసింది.  సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 లీగ్ లో ఓపెనర్  శిఖర్ ధావన్  గాయపడడంతో అతని స్థానంలో విండీస్ తో జరిగే  టీ 20 సిరీస్ కు  సంజు శాంసన్ ను తీసుకుంటున్నట్లు  కొద్దీ సేపటి క్రితం  బీసీసీఐ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: