క్రికెట్ అభిమానులందరికీ క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటలో అతని విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పొట్టి క్రికెట్ లో అతడు బ్యాటింగ్ దాడికి కుదేలైన బౌలర్లు ఎందరో ఉన్నారు. తన ఆటతీరుతో బౌలర్లకి ఫ్రస్టేషన్ తెప్పించే గేల్ తాను ఫ్రస్టేషన్ కి గురయ్యాడు. ఈ ఫ్రస్ట్రేషన్ లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందనేది చూస్తే, గేల్ గత కొన్ని రోజులుగా సరిగా ఆడట్లేదు. అటు టీ ట్వంటీ అయినా, వన్డే అయినా మునుపటి ప్రదర్శనని కనబరచట్లేదు. 

 

ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు అభిమానులతో పాటు ఫ్రాంఛైజీలు కూడా అతని ఆటతీరు పట్ల నిరాశని వ్యక్తం చేశాయి. దాంతో క్రిస్ గేల్ ఫ్రస్టేషన్ కి గురయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అతడి మాటల్లో స్పష్టంగా ఏర్పడింది. గేల్ మాట్లాడుతూ, ‘ఫ్రాంచైజీ క్రికెట్‌లో నేను ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైతే ప్రతీ జట్టు నన్నూ భారంగా భావిస్తూ ఉంటుంది. నాకు తగిన గౌరవం దక్కదు. 

 

అప్పటి వరకు నేను జట్టుకు చేసిందంతా అందరూ మర్చిపోతారు. అయితే వీటికి అలవాటు పడటం నేర్చుకున్నానని అన్నాడు. అయితే ఆ  ఫ్రస్ట్రేషన్ అక్కడితోనే ఆగిపోలేదు. ఆటకి విరామం ఇచ్చే స్థాయికి వెళ్ళింది. గేల్  తన ఆటకి కొద్ది రోజులు విరామం ఇవ్వాలని అనుకుంటున్నాడట.  కొద్ది రోజులు విరామం తిసుకుని తన శరీరాన్ని ఆటకోసం క్రమబద్ధం చేసుకునే పనిలో ఉంటాడట.  దాంతో వచ్చే నెలలో జరిగే భారత పర్యటనలో గేల్‌ ఆడే అవకాశం లేదు. 

 

ఈ టూర్‌లో భాగంగా భారత్‌–వెస్టిండీస్‌ మధ్య మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇకపై తాను ఏ టోరీ్నలోనూ ఆడబోవడం లేదని అతను స్పష్టం చేశాడు. అయితే వచ్చే 2020 లో టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం తనని తాను సన్నద్ధం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 2020 లో మళ్ళీ పాత గేల్ ని చూడబోతున్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: