డిసెంబరు ఆరవ తేదీ నుండి వెస్టిండిస్ తో భారత్ కి టీ ట్వంటీ సిరీస్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులకి పదిహేను మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ జట్టులోకి మరో ఆటగాడిని తీసుకోనున్నారు. బంగ్లాదేశ్ తో టీ ట్వంటీలకి సెలెక్ట్ అయినా బెంచీకె పరిమితమయిన కేరళ ఆటగాడు సంజూ సాంసన్ ని ఈ మ్యాచులకి తిసుకునే అవకాశం కనిపిస్తుంది. వెస్టిండీస్ తో మ్యాచులకి సెలెక్ట్ అయిన శిఖర్ ధావన్ గాయం కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు.

 

 


అదొక్కటే కాదు గత కొన్ని రోజులుగా ధావన్ సరైన ప్రదర్శన కనబరచలేదు. బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీలో పేలవ ప్రదర్శనని కనబరిచి విమర్శలను మూటగట్టుకున్నాడు.  ఇప్పటికే అతని ఆట తీరు సరిగా లేనందున టెస్టుల్లో స్థానాన్ని పోగొట్టుకున్నాడు. బంగ్లాదేశ్ తో టీ ట్వంటీల్లో విఫలమయ్యాక ఢిల్లీ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడినప్పటికీ, అక్కడ కూడా తనదైన ఆట ఆడలేకపోయాడు. ఈ ట్రోఫీలోనే అతని మోకాలికి గాయం అయింది. 

 

 

గాయంతో ఆస్పత్రిలో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ శిఖర్ ధావన్ మరో నాలుగు రోజుల్లో మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పాడు. కానీ ఇప్పుడా అవకాశం లేదు. అతను ప్రేక్షకులని కలుసుకోవాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. సెలెక్టర్ల బృందం  అతని స్థానంలో మరొకరిని తీసుకోవాలని భావిస్తుంది. అందునా ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతుండడంతో అతన్ని పక్కకి పెట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 

గాయం నుంచి కోలుకున్నప్పటికీ, ఆడడానికి సిద్ధంగా లేకపోవడంతో అతని స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ అవకాశాన్ని సంజూ సాంసన్ సరిగ్గా వినియోగించుకుంటాడా లేదా చూడాలి. డిసెంబరు ఆరవ తేదీ నుండి వెస్టిండీస్ తో మ్యాచ్ జరనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: