బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తో పాటు చివరి మ్యాచులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్న ఆటగాడు దీపక్ చాహర్. ఈ నవంబరు నెల భారత బౌలర్ దీపక్ చాహర్ కి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో అతడు తన బౌలింగ్ తో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో హ్యాటిక్ వికెట్లు తీయడమే కాకుండా, అతి తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు పొందాడు. 

 

ఇంకా భారత పురుష క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఈ హ్యాట్రిక్ సాధించిన రెండు రోజుల్లోనే మరో హ్యాట్రిక్ సాధించి బౌలింగ్ లో తానేంటీ నిరూపించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలీ విదర్భ మీద ఈ హ్యాట్రిక్ సాధించాడు. తన బౌలింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ ఆటగాడు ఈ సారి తన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. అయితే ఇప్పుడు అదే టోర్నీలో మరో అరుదైన రికార్డు నెలకొల్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

 

ఈ టోర్నీలో రాజస్థాన్ తరపున ఆడుతున్న దీపక్ చాహర్ ఈ సారి బ్యాటింగ్ లో తన మెరుపులు కనబరిచాడు. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో ఏదు సిక్సర్లు బాది రాజస్థాన్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు. ఏడవ బ్యాట్సెమెన్ గా బరిలోకి దిగి దిగిన దీపక్ చాహర్ పదహారవ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి ఆహా అనిపించాడు. ఆ తర్వాత ఓవర్లలో మరో నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో అతని స్కోరు యాభై ఐదుకి చేరింది. 

 

అయితే ఈ మ్యాచ్ లో అతడు ఒక్క ఫోర్ కూడా కొట్టకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో గెలవడం వల్ల రాజస్థాన్ సెమీఫైనల్ కి చేరుకుంది. దేశవాళీ టీ ట్వంటీల్లో ఒక్క ఫోర్ కొట్టకుండా హాఫ్ సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా దీపక్  చాహార్ రికార్డు నెలకొల్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: