భారత క్రికెట్ లో క్రికెటర్ల సంపాదన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ఆటలో సంపాదిస్తూనే, ఇటు బ్రాండ్ల అంబాసిడర్లుగా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తారు. అయితే బ్రాండ్లకి అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ఎక్కువ సంపాదిస్తున్న వారిలో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ రేసులో మరో ఆటగాడు కూడా చేరాడు. మైదానంలో అటు బ్యాటింగ్ తోనూ, ఫీల్డింగ్ లోనూ ఆకట్టుకునే ఆటగాడు రోహిత్ శర్మ. 

 

మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో  కెప్టెన్ గానూ తానేంటో నిరూపించుకున్నాడు. టెస్టుల్లో ఓపెనర్ గా వచ్చిన మొదటి మ్యాచ్ లోనే డబల్ సెంచరీ సాధించి, పరిమిత ఓవర్లకే పరిమితం అనుకున్న అందరికీ తానేంటో చూపించాడు. అటు వన్డేల్లో రాణించడం, టెస్టుల్లో రాణించడంతో అభిమానుల్లో రోహిత్ పట్ల అభిమానం రెట్టింపైంది. దీంతో అతని బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. ఎన్నో కంపెనీలు అతని  కోసం పోటీ పడుతున్నాయి. 

 

ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం రోహిత్ కి బాగా కలిసొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రోహిత్ తన ఆదాయాన్ని యాభై ఐదు శాతాన్ని పెంచుకున్నాడు. మొత్తం ఇరవై రెండు బ్రాండ్లకు తాను ప్రచారకర్తగా ఉన్నాడు. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పది బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రచార కర్తగా రోహిత్ శర్మ ఏడాదికి డెభ్బై  మూడు నుండి డెభ్భై ఐదు కోట్ల వరకు సంపాదిస్తున్నాడట. ఇది గతంలో చాలా తక్కువగా ఉండేదట. 

 

ఆటలో అతని పర్ ఫార్మెన్సు ద్వారా బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిందని తెలుస్తుంది.  రోహిత్ శర్మ ఏడాదిలో రెండు రోజుల ఒప్పందానికి రెండు కోట్ల వరకి తీసుకుంటున్నాడట. ఇదే కోహ్లీ, ధోనీలైతే ఈ రేటు కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. మొత్తానికి బ్రాండ్ వాల్యూలో రోహిత్ శర్మ ధోనీ, కోహ్లీ తర్వాత మూడవ స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: