బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ అనంతరం భారత జట్టు పొట్టి క్రికెట్ మీద దృష్టి సారించింది. 2020 లో ఆస్ట్రేలియాలో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం సన్నద్ధం అవుతోంది. దానిలో భాగంగానే వచ్చే నెలలో వెస్టిండీస్ తో మూడు టీ ట్వంటీ మ్యాచులు ఆడనుంది. ఈ సిరీస్ భారత్ లోనే జరగనుంది. దీని తర్వాత శ్రీలంక కి ఆతిథ్యమివ్వనుంది. శ్రీలంకతో మ్యాచులు ముగిసాక భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకి వెళ్ళనుంది. 

 

అయితే వచ్చే నెల డిసెంబరు ఆరవ తేదీన వెస్టిండీస్ తో మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో సంజూ సాంసన్ కి చోటు దక్కింది. అయితే శిఖర్ ధావన్ ఆడకపోవడంతో వెస్టిండిస్ తో జరిగే మ్యాచులకి ఓపెనర్ గా ఎవరు వెళ్తారనే ఆసక్తి మొదలైంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మల ఓపెనింగ్ భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు శిఖర్ ధావన్ లేకపోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అయితే జట్టు సభ్యులందరిలోకి కే ఎల్ రాహుల్ అయితే ఓపెనర్ గా బాగుంటుందని అనుకుంటున్నారు. కే ఎల్ రాహుల్ బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీల్లోనూ, ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ తనదైన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో ఓపెనర్ గా రోహిత్ కి జోడీగా కే ఎల్ రాహుల్ అయితే బాగుంటుంది. 

 

అటు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సైతం కే ఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగితేనే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కే ఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అతడు ఓపెనర్ గా దిగితేనే రాణిస్తాడని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: