బీసీసీఐ  అధ్యక్షుడి  గా బాధ్యతలు  తీసుకున్నప్పటినుండి  తన దైన మార్క్ పాలన తో దూసుకుపోతున్నాడు భారత మాజీ సారథి   సౌరవ్ గంగూలీ.  అందులో భాగంగా డే అండ్ నైట్ టెస్టుల  కోసం ప్రయత్నాలు చేసి  అందులో సక్సెస్ అయ్యాడు.  తాజాగా  అతడి అధ్యక్షతన  జరిగిన  తొలి సర్వ సభ్య సమావేశంలో తనకు అడ్డుగా  ఉన్న  లోధా సంస్కరణల్లో మార్పులు చేపట్టాడు.  ఈమార్పులకు బోర్డు  సభ్యులు కూడా ఆమోదం  తెలిపారు.  అయితే  దీనికి అత్యున్నత న్యాయస్థానం  సుప్రీం కోర్టు కూడా  ఆమోదం  తెలుపాల్సి వుంది. కోర్టు గనుక  ఆ కొత్త సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే  2024 వరకు  గంగూలీ ,బీసీసీఐ అధ్యక్షుడిగా  పదివిలో కొనసాగవచ్చు.  
 
 
ఇంతకుముందు  బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా  గంగూలీ  5ఏళ్ళు పనిచేయడం తో లోధా  సంస్కరణల ప్రకారం అతను  కేవలం తొమ్మిది నెలలే  బీసీసీఐ అధ్యక్షుడి పదవిలో  కొనసాగాలి.  అయితే ఇప్పుడు ఆ సంస్కరణల్లో మార్పులు  తీసుకొచ్చారు కాబట్టి  2024 వరకు  అధ్యక్షుడిగా  కొనసాగే అవకాశం ఉంటుంది.  మరి  ఈ సంస్కరణలకు సుప్రీం కోర్టు ఆమోదం తెలుపుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: