క్రికెట్ మైదానం లో మాదిరిగానే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు . ఐపీల్ జట్లు విదేశాల్లో స్నేహపూర్వక మ్యాచ్ లు ఆడేందుకు గంగూలీ ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది . విదేశీ జట్ల తో స్నేహపూర్వక మ్యాచ్ లు ఆడేందుకు ఐపీల్ ప్రాంచైజీ జట్లు ఆసక్తిగా ఉన్నాయి . ముంబయి ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు విదేశీ జట్ల తో మ్యాచ్ లు ఆడేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి .

 

 దీనిద్వారా విదేశాల్లో నివసించే భారతీయ సంతతి వారిని ఆకట్టుకోవడం తో పాటు , తమ ప్రాంచైజీ మార్కెట్ ను విస్తృత పర్చుకోవాలన్నది ఆయా ప్రాంఛైజీలు లక్ష్యంగా కన్పిస్తోంది . దీనికి గంగూలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో, త్వరలోనే ఐపీల్ ప్రాంచైజీ జట్లు విదేశీ జట్లతో స్నేహపూర్వక మ్యాచ్ లు ఆడే అవకాశాలు లేకపోలేదని క్రీడా పరిశీలకులు  అంటున్నారు . ఇక  ఐపీఎల్ 20 20 సీజన్ వేలం లో 970 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు .

 

  డిసెంబర్ 19న కోల్ కతా లో  జరగనున్న ఈ వేలంలో 713 మంది భారతీయ ఆటగాళ్లు ,  258 మంది విదేశీ ఆటగాళ్లు వేలం ప్రక్రియ లో పాల్గొననున్నారు .  భారతీయ ఆటగాళ్లలో 215 మంది క్యాప్డ్  ప్లేయర్లు , 754 మంది అన్ క్యాప్డ్   ప్లేయర్లు ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.  ఇప్పటి వరకు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లను క్యాప్డ్ ప్లేయర్లుగా , ఇక తమ దేశ జట్టుకు  ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా  పిలుస్తారు .  నవంబర్ 30 తో ఐపీఎల్ ప్లేయర్ల నమోదు ప్రక్రియ ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: