ఇటీవల బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతం కావడంతో సాధ్యమైనన్ని డే అండ్‌ నైట్‌ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మొగ్గుచూపుతున్నాడు. ఈ విషయాన్ని గంగూలీ గతంలోనే చెప్పినా, మరొకసారి పింక్‌ బాల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై ఆయన అందరికి స్పష్టత ఇచ్చాడు.

 

అసలు పింక్‌ బాల్‌ టెస్టులను ఆడించాలనే యోచనకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని స్టేడియంలోకి  తీసుకురావాలనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణమన్నాడు. ఇక నుంచిభారత జట్టు ఆడే ప్రతీ టెస్టు సిరీస్‌లో  విరాట్‌ కోహ్లి నేతృత్వంలో  ఒక పింక్‌ బాల్‌ మ్యాచ్‌ను ఉండేలా చూస్తామన్నాడు.ఇప్పటినుండి జరిగే మ్యాచులలో పింక్‌ బాల్‌ మ్యాచ్‌ తప్పనిసరి అనే నిర్ణయం తీసుకున్నాడు. 

 

 నిజంగా ‘పింక్‌ బాల్‌ టెస్టు సక్సెస్‌ కావడం ఎంతో గర్వకారణం , ఆహ్వానించదగ్గ పరిణామం.బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దీన్ని ముందుకు తీసుకెళ్లడమే నా తదుపరి లక్ష్యం. కానీ  ప్రతీ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్‌ టెస్టు కావాలని నేను అనను. నేను అనేది ఏమిటంటే ఒక టెస్టు సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ జరగాలి.  అంటే ఒక పింక్ మ్యాచ్ జరగాలి. ఈ ఒక్క చోటే కాకుండా మిగితా అన్ని చోట్ల దీన్ని ప్రవేశపెట్టడమే నా  లక్ష్యం  అని తెలిపారు .

 

నా యొక్క అనుభవాన్ని ఉపయోగించి మిగతా చోట్ల ఎలా పింక్‌ బాల్‌ నిర్వహించాలనే దాని కోసం ప్రయత్నిస్తా అంటూ గంగూలీ వివరించాడు . టెస్టు మ్యాచ్‌కు ఐదు వేల మంది మాత్రమే వస్తే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్టపడతాడు. అలా ఆడాలంటే ఏ క్రికెటర్‌ ఇష్టంతో ఆడడు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక కోల్‌కతాలో మ్యాచ్‌ తర్వాత కోహ్లి పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పింక్‌ బాల్‌ టెస్టులు అనేవి రెగ్యులర్‌ షెడ్యూల్‌లో భాగంగా ఉండవన్నాడు. ఇవి అప్పడప్పుడు మాత్రమే ఉంటాయన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: