బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించింది. రెండు మ్యాచుల సిరీస్ లో ఒకానొక మ్యాచ్ పింక్ మ్యాచ్ కావడం విశేషం. కోల్ కతా వేదికగా ఈ డెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ పింక్ మ్యాచ్ లో భారత్ విజయకేతనం ఎగరవేసింది. భారత్ కిది మొట్టమొదటి పింక్ మ్యాచ్ అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా చాలా బాగా ఆడింది. అయితే గతంలో పింక్ బాల్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినప్పటికీ భారత్ దానికి ఒప్పుకోలేదు.

 

అయితే భారత మాజీ క్రికెట్ర్ సారధి గంగూలీ బీసీసీఐ అధ్యక్ష్యుడైన తర్వాత పింక్ బాల్ మ్యాచుల గురించి చాలా సీరియస్ గా తీసుకున్నాడు. టెస్టులకి ఆదరణ పెరగాలంటే పింక్ బాల్ మ్యాచులు ఆడాలని గంగూలీ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై కోహ్లీతో చర్చించి పింక్ బాల్ మ్యాచ్ కి ఒప్పించాడు. గంగూలీ చొరవతోనే భారత జట్టు మొదటి పింక్ బాల్ మ్యాచ్ ఆడగలిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి మ్యాచులు ఉంటాయా అని సందేహిస్తున్న నేపథ్యంలో గంగూలీ వాటికి ఈ విధంగా స్పందించాడు.

 

అసలు పింక్‌ బాల్‌ టెస్టులను ఆడించాలనే యోచనకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని స్టేడియాలకు తీసుకురావాలనే ఉద్దేశమే ప్రధాన కారణమన్నాడు. ఇక నుంచి విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఆడే ప్రతీ టెస్టు సిరీస్‌లో ఒక పింక్‌ బాల్‌ మ్యాచ్‌ను ఉండేలా చూస్తామన్నాడు. ‘పింక్‌ బాల్‌ టెస్టు సక్సెస్‌ కావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని ముందుకు తీసుకెళ్లడమే నా తదుపరి లక్ష్యం అని చెప్పాడు

 

ప్రతీ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్‌ టెస్టు కావాలని నేను అనను. ఒక టెస్టు సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ జరగాలి. టెస్టు మ్యాచ్‌కు ఐదు వేల మంది మాత్రమే వస్తే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్టపడతాడు. అలా ఆడాలంటే ఏ క్రికెటర్‌ ఇష్టంతో ఆడడు’ అని గంగూలీ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: