ఈనెల  6న  ఉప్పల్ లో  టీమిండియా -వెస్టిండీస్ జట్ల మధ్య  మొదటి  టీ 20 మ్యాచ్ జరుగునున్న విషయం తెలిసిందే. ఇక  మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తే  కఠిన చర్యలు తప్పవని  రాచకొండ సీపీ మహేష్ భగవత్  హెచ్చరించారు.  హెచ్ సి ఏ  నూతన అధ్యక్షుడు , మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తో కలిసి మహేష్  భగవత్
 మీడియా సమావేశం లో పాల్గొన్నారు. 
 
 
ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ ... 1800 మంది పోలీసులతో మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రతా  ఏర్పాటు చేశాం. సిసి కెమెరాల  ద్వారా  స్టేడియాన్ని పర్యవేక్షిస్తాం. మ్యాచ్ కు ఆటకం కల్గిస్తే   కఠిన చర్యలు  తప్పవని  అన్నారు.  అలాగే  స్టేడియం లోకి  జాతీయ జెండా ను మాత్రమే అనుమతిస్తామని మిగితా  జెండాలు , సిగరెట్లు, అగ్గిపెట్టలు ,ల్యాప్ టాప్ లు , హెల్మెట్లు, ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. మ్యాచ్  సందర్భంగా  రేపు  రాత్రి  1 గంటవరకు  మెట్రో రైళ్లు సేవలందిస్తాయి.  ఏదైనా అసౌక్యరం కలిగితే 100 డయల్ చేయండి , మహిళల రక్షణ కోసం షీ టీం లను కూడా ఏర్పాటు చేశామని  మహేష్  భగవత్ వెల్లడించారు.  ఇక ఈమ్యాచ్ ను వీక్షించేందుకు  40000  మంది ప్రేక్షకులు  స్టేడియం  కు   వచ్చే అవకాశం ఉందని అజారుద్దీన్  అన్నారు. ఇప్పటివరకు 24000 టికెట్లను  విక్రయించినట్లుగా తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: