ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ వచ్చే ఏడాది జరుగనున్నది ,ఇందులో  భాగంగా భారత జట్టకు భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ ఎంపిక కావడంతో  ఆయన దీనిపై ఆనందాన్ని  వ్యక్తం చేస్తున్నాడు.  మాజీ కోచ్‌, ఎన్‌సీఏ చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌  అండర్‌-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం వెనుక వీరిద్దరి కృషి ఎంతో ఉందన్నాడు.

 

అంతే కాదు జైస్వాల్‌ ఇప్పుడు  నిలకడగా పరుగులు చేస్తున్నాడంటే  అదంతా ద్రవిడ్‌ సర్‌ వల్లే అంటూ  ఆయన  స్పష్టం చేశాడు. ‘ ద్రవిడ్‌ సర్‌ ఎప్పటికప్పుడు ఆడే ప్రతీ బంతిపై ఫోకస్‌ పెట్టమని  చెబుతూ ఉండేవారు. ఏ బంతిని నువ్వు ఎదుర్కొంటున్నావో అప్పుడు ఆ బంతిపై దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేవారు.ముఖ్యంగా  ఏ ఏరియాల్లో నేను బలహీనంగా ఉన్నానో అంటే ప్రాక్టీస్‌ సెషనల్‌లో వాటిని సరిచేసేవారు.  ఇలా ద్రవిడ్‌ సర్‌ చెప్పిన ప్రతీ విషయం నాకు చాలా ఉపయోగపడింది’ యశస్వి జైస్వాల్‌ పేర్కొన్నాడు. ఇక తన ప్రదర్శన గురించి జైస్వాల్‌ మాట్లాడుతూ.. ‘ నేను ప్రతీ మ్యాచ్‌ను ఒకే రకంగా ఆస్వాదిస్తాను.

 

నేను కింది స్థాయిలో ఎంత సహజ సిద్ధంగా ఆడానో అదే ప్రదర్శనను రిపీట్‌ చేయడంపై ఫోకస్‌ చేస్తా. నా ఆటపైనే దృష్టి పెడతా.. ఫలితాలపై కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా’ అని  తెలిపాడు. యశస్వి జైస్వాల్‌ మూడు డబుల్‌ సెంచరీలతో విజయ్‌ హజారే ట్రోఫీలో ఆకట్టుకున్నాడు.  ఒక డబుల్‌ సెంచరీ కూడా అందులో ఉంది. దాంతో అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టులో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది.

 

యశస్వి అక్టోబర్‌లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో  203 పరుగులు సాధించాడు. దీని ఫలితంగా అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్‌–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: