టీమ్ ఇండియా జట్టు వరుసగా సిరీస్ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వరుస టెస్ట్ సిరీస్లను గెలిచి ఒక రేంజ్ లో సత్తాచాటిన టీమిండియా జట్టు... ఇప్పుడు టి20 సిరీస్ లో గెలుచుకోవడానికి సిద్ధమయింది. ఇక శుక్రవారం రాత్రి హైదరాబాద్ వేదికగా  ఉప్పల్ స్టేడియంలో జరిగిన వెస్టిండీస్తో తొలి టీ-20 మ్యాచ్ లో  ఆరు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసింది టీమిండియా. అయితే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... కేఎల్ రాహుల్ లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించడంతో  అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. దీంతో మరో  టి20 మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకునేందుకు  టీమిండియా సిద్ధమవుతోంది. 

 

 

 

 అటు వెస్టిండీస్ కూడా ఈరోజు రాత్రి తిరువనంతపురం వేదికగా జరగబోయే టి20 మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ని 1-1 తో సమం  చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకవేళ తిరువనంతపురం వేదికగా జరగబోయే టి20 సిరీస్ లో మరోసారి టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి  విజయాన్ని సొంతం చేసుకుంటే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం గత మ్యాచ్ లో  కె.ఎల్.రాహుల్ విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో కనిపించారు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో కూడా వీరిద్దరూ అదే ఫామ్  కొనసాగించాలని టీమిండియా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అంతే కాకుండా టీమ్ ఇండియా సిక్సుల  వీరుడు రోహిత్ శర్మ కూడా తన సత్తా చాటాలని కోరుకుంటున్నారు. 

 

 

 

 అయితే శుక్రవారం హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలర్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ జడేజాలు బౌలింగ్ లో తేలిపొగ... అటు భువనేశ్వర్ కూడా బౌలింగ్లో అంతగా రాణించలేక పోయారు. దీపక్ చాహర్,  చాహల్  మాత్రం బౌలింగ్లో పర్వాలేదనిపించారు. దీంతో బౌలింగ్ విషయంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణికట్టు స్పిన్నర్ పైన కుల్దీప్ యాదవ్ కి తుది జట్టులో చోటు కల్పించి... రవీంద్ర జడేజావాషింగ్టన్ సుందర్ వీరిద్దరిలో  ఒకరి పై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు టెస్టు సిరీస్లో, టీ 20 లలో తన దూకుడును చూపిస్తున్న టీమిండియా మరోసారి తన దూకుడు చూపించు వెస్టిండీస్తో టి20 సిరీస్ ని సొంతం చేసుకోవాలని క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: