టీమిండియా  డ్యాషింగ్ ఓపెనర్  వీరేంద్ర సెహ్వాగ్  కు  ఈ రోజు  తన జీవితంలో ఎప్పటికి  గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే  ఎనమిది సంవత్సరాల క్రితం  ఇదే రోజున  వన్డేల్లో  డబుల్ సెంచరీ చేసి చరిత్ర  సృష్టించాడు సెహ్వాగ్.  2011లో ఇండోర్ లో వెస్టిండీస్ తో  జరిగిన వన్డే మ్యాచ్ లో  149బంతుల్లో  219 పరుగులతో విధ్వసం సృష్టించాడు.  తద్వారా మాస్టర్ బ్లాస్టర్  సచిన్ తర్వాత  వన్డే ల్లో డబుల్ సెంచరీ సాధించిన  బ్యాట్స్ మెన్ గా  చరిత్రలో నిలిచిపోయాడు సెహ్వాగ్.  అందుకే  సెహ్వాగ్ కు ఈరోజు  ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్ లో  సెహ్వాగ్ మరో 21 బంతులు  మిగిలివుండగా వెనుదిరిగాడు.
 
 
 
ఇక సెహ్వాగ్  ప్రస్తుతం  క్రికెట్ వ్యాఖ్యాత గా అలాగే  ఐపీఎల్  టీం కు మెంటర్ గా  వ్యవహరిస్తు  బిజీ గా గడుపుతున్నాడు.  ఎదుట  ఎలాంటి  బౌలర్  ఉన్న భయపడకుండా దూకుడుగా ఆడే నైజం  సెహ్వాగ్ సొంతం.  అందుకే   భారత క్రికెట్ అభిమానులకు  తమ  అల్ టైం ఫేవరేట్ ఓపెనర్ గా సెహ్వాగ్ గుర్తుండిపోతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: