టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ.. ఇతనికి ఎంతమంది అభిమానులు ఉన్నారో సంఖ్యలో చెప్పేలేము.. ఇతనంటే ఎంతమంది అమ్మాయిలు పడిచస్తారు అనేది చెప్పలేము.. ఎందుకంటే అంతమంది అభిమానులు ఉన్నారు కోహ్లీకి. ఇంకా విషయానికి వస్తే.. కోహ్లీ అభిమానులు కోహ్లీ ఎందుకు మాంసం తినడు.. అసలు అతనికి ఇష్టమైన ఆహారం ఏంటి అనేదాని గురించి అభిమానులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..  

 

కోహ్లీది పంజాబీ కుటుంబం వారి ఇంట్లో తిండికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లో రాజ్మా చావల్‌, బటర్‌ చికెన్‌ ఎప్పుడు ఎక్కువ వండేవాళ్లు అని చెప్పాడు కోహ్లీ. అయితే రాజధాని ఢిల్లీలో ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం దగ్గర్లో నిజామ్స్‌ హోటల్‌ వద్ద కాటీ రోల్స్‌ ప్రతి రోజు తినేవాడు అని.. మ్యాచ్ అయిన వెంటనే అక్కడికే వెళ్ళేవాడు అని చెప్పాడు కోహ్లీ. 

 

అంతర్జాతీయ నగరాల్లో లండన్‌లో ప్రపంచంలోని వెరైటీలన్నీ అక్కడ దొరుకుతాయిని విదేశీ వంటకాల్లో అతని జపనీస్‌ ఫుడ్‌ అంటే ఇష్టం అని చెప్పారు. వెజిటేరియన్‌గా మారాక కొత్త కొత్త రుచుల్ని రుచి చూస్తున్నాను అంటూ అతను నాన్ వెజ్ ఎందుకు మానేశాడు అనే విషయాన్నీ వెల్లడించాడు. 

 

నాలుగేళ్ల క్రితం కోహ్లీకి ఫిట్‌నెస్‌ సమస్య రావడంతో వైద్యుణ్ని సంప్రదించాడు అని చెప్పాడు. అయితే అప్పుడు మాంసాహారం ఎక్కువ తినడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్య వచ్చి శరీరంలో కాల్షియం తగ్గిపోతోందనీ, ఆ ప్రభావం ఎముకలమీద పడుతోందనీ అతనికి చెప్పారు అని అప్పటినుంచి మాంసాహారం తగ్గిస్తూ వచ్చినట్టు అయన చెప్పారు. అంతేకాదు రెండు సంవత్సర నుండి అతను పూర్తి వెజిటేరియన్ గా మారిపోయినట్టు అయన చెప్తున్నాడు. చూశారుగా.. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన కోహ్లీకే ఆరోగ్య సమస్యలు వచ్చాయి మరి మనమెంత.. అందుకే మాంసం తినడం తగ్గిద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: