తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20 లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రెండో టీ20లో 19 పరుగులు చేసిన విరాట్.. రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (2,562)ను అధిగమించాడు. ఇకపోతే రోహిత్ 103 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధిస్తే కోహ్లీ అతడిని దాటేందుకు కేవలం 74 మ్యాచ్‌లు మాత్రమే తీసుకోవడం విశేషం.. ఇక మరోవైపు ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ 22 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ఉప్పల్ టీ20లో 23వ హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ అతడ్ని వెనక్కి నెట్టి నెం.1 స్థానాన్ని అధిరోహించాడు.

 

 

ఇక రికార్డ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత వరుసగా మార్టిన్ గప్తిల్ (17 హాఫ్ సెంచరీలు), పాల్ స్టిర్లింగ్ (16), డేవిడ్ వార్నర్ (16) టాప్-5లో కొనసాగుతున్నారు.. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో తనకిదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. దీంతో గతంలో నమోదు చేసిన 90 పరుగులు నాటౌట్ హైయస్ట్ స్కోరును అధిగమించాడు. మరోవైపు రెండో టీ20 వాల్ష్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఐదో బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా అత్యధిక పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 74 మ్యాచ్‌ల్లో 52.31 సగటుతో 2,563 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 136.6 కావడం విశేషం. కోహ్లీ తర్వాత రోహిత్, మార్టిన్ గప్టిల్, షోయబ్ మాలిక్, బ్రెండన్ మెకల్లమ్ వరుసగా టాప్-5లో నిలిచారు..

 

 

ఇక ప్రస్తుతం వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో విండీస్ విజయానికి 171 పరుగుల లక్ష్యం చేదించాల్సి ఉంది.   వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (11) రూపంలో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ 15 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే మాత్రం సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 30 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. 97 పరుగుల వద్ద శివం దూబే మూడో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ భారం కోహ్లీపై పడింది. ఇకపోతే ఇప్పటివరకు మూడు టీ20 ల సిరీస్‌లో కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: