సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ లో  గాయపడడంతో  ప్రస్తుతం  వెస్టిండీస్ తో జరుగుతున్న  టీ 20 సిరీస్ నుండి  తప్పుకున్న  టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్  కోలుకుంటున్నాడు. అయితే అతను పూర్తి గా కోలుకోవడానికి  మరి కొన్ని రోజుల సమయం  పట్టనుండడం తో  విండీస్ తో వన్డే సిరీస్ కు కూడా   ధావన్  అందుబాటులో ఉండేది అనుమానంగానే మారింది.  బీసీసీఐ మెడికల్ టీం ను  కూడా నిన్న ఇదే విషయాన్ని వెల్లడించింది.  ధావన్ మోకాలి గాయం పై రివ్యూ చేసిన  మెడికల్ టీం.. ఆగాయం   పూర్తిగా తగ్గడానికి మరికొన్ని రోజులు  పడుతుందని  వెల్లడించింది. దాంతో  విండీస్ తో జరుగనున్న వన్డే సిరీస్ కు  ధావన్  అందుబాటులో  ఉండకపోవచ్చు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 
 
 
ఒకవేళ ధావన్ గనుక  తప్పుకుంటే  రోహిత్ శర్మ  తో కలిసి  కేఎల్ రాహుల్  ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక  ధావన్  స్థానం కోసం ముగ్గురు యువ క్రికెటర్లు  పోటీ పడుతున్నారు. అందులో భాగంగా సంజు సాంసన్ , మయాంక్ అగర్వాల్ , శుభమాన్ గిల్  లలో  ఎవరో ఒకరు రిజర్వడ్ ఓపెనర్  గా చోటు దక్కించుకోనే అవకాశాలు వున్నాయి. మూడు మ్యాచ్ ల  వన్డే సిరీస్ లో భాగంగా  ఈనెల 15న  చెన్నై లో  వెస్టిండీస్ తో టీమిండియా మొదటి మ్యాచ్ లో తలపడనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: