గత కొంత కాలంగా టీమిండియా అభిమానుల నోళ్లలో నానుతున్నపేరు సంజూ శాంసన్‌ . ఈ కేరళ క్రికెటర్‌  గత కొన్ని సిరీస్‌లుగా టీమిండియాతో ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం ఉండటం లేదు.  టీమ్‌మేనేజ్‌మెంట్‌ ప్రతిసారి రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా విఫలమవుతున్నప్పటికీ  అతడికే పదేపదే అవకాశాలు ఇస్తోంది. దీంతో శాంసన్‌తో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. 


కనీసం శాంసన్‌కు   ఒక్క మ్యాచ్‌ అయినా ఆడే అవకాశం ఇస్తే  తన ప్రతిభ ఏంటో తెలుస్తుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌  ఇప్పటికే శాంసన్‌ను కాదని పంత్‌ను తీసుకోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పంత్‌ విఫలమవ్వడంతో..ఈసారి  స్థానిక క్రికెటర్‌ శాంసన్‌కు  జరగబోయే  తిరువనంతపురం మ్యాచ్‌లోఅవకాశం ఇస్తారని అందరూ భావించారు. అయితే శాంసన్‌ పేరు తుది జట్టులో  లేకపోవడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. 

 

అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌  ఈ కేరళ క్రికెటర్‌ను ఆడించకపోవడంపై అభిమానులతో పాటు వీరు కూడా పెదవి విరిచారు.  తన సొంత మైదానంలో టీమిండియా తరుపున శాంసన్‌ను ఆడించే అవకాశం ఇస్తారని భావించాము. కానీ అందరికి నిరాశే ఎదురైంది. శాంసన్‌కు ఉన్న అత్యంత ధైర్య సాహసాలు, ఓపికకు మేమందరం ఏంతో ప్రేరణ పొందుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌ సందర్భంగా కూడా మైదానంలో శాంసన్‌.. శాంసన్‌ అంటూ లోకల్‌ ఫ్యాన్స్‌ గట్టిగా అరిచిన విషయం తెలిసిందే. 

 

ఇక ఈ కాంగ్రెస్‌ నేత శాంసన్‌ను బంగ్లాదేశ్‌ సిరీస్‌ ముగిశాక కూడా ఆడించకపోవడంపై  తప్పుబట్టారు. శాంసన్‌ను ‘అవకాశం ఇవ్వకుండా సంజూ  ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. మూడు టీ20ల సిరిస్‌లో డ్రింక్స్‌ ఇవ్వడం వరకే పరిమితం చేశారు. తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతడి బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా లేక అతని హృదయాన్నా?’అంటూ శశిథరూర్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: