సౌతాఫ్రికా క్రికెట్ జట్టు... ఈ జట్టు గురించి ఆ విషయం వచ్చిన అది ఒక పెద్ద న్యూసే. దీనికి కారణం ఆ జట్టులో ఉండే ప్లేయర్స్. జాక్ కలీస్, ఎన్తిని, ఏబిడీ, డైల్ స్టైన్... ఇలా ఆ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఈ దేశ ప్లేయర్స్ కి  అభిమానులు ఉన్నారు. ఈ దేశ  క్రికెట్ ఒక దశాబ్ద కాలంపాటు కొన్ని కారణాల వలన క్రికెట్ నుండి బహిష్కరించ బడింది. ఇంకో విషయం ఏమిటంటే టీంలో అంత మంచి ప్లేయర్లు ఉన్న ఈ దేశం మాత్రం ఒక్కసారి కూడా ప్రపంచ కప్ ని మాత్రం గెలవలేక పోయింది.

 

అయితే ఇప్పుడు ప్రధాన కోచ్‌గా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ ను నియమించారు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు. నిజానికి తనను తొలుత మధ్యంతర కోచ్‌గా నియమిస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఒకప్పటి బౌచర్ టీమ్‌ మేట్, క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. సౌత్ ఆఫ్రికా ప్రధాన కోచ్ బాధ్యతలు బౌచర్‌కు అప్పగిస్తున్నట్లు తాజాగా వివరించాడు.


సౌత్ ఆఫ్రికా తరపున సుదీర్ఘకాలం ఆడిన బౌచర్ వికెట్‌ కీపర్ కం బ్యాట్స్‌ మన్‌ గా రాణించాడు. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా వన్డేల్లో వరల్డ్ రికార్డు ఛేదన (435 రన్స్‌)లో ఆఖరి బంతికి బౌండరీ కొట్టి జట్టును గెలిపించిన విషయం ప్రపంచ క్రికెట్ అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ప్రస్తుతం సహాయక కోచ్‌ గా పనిచేస్తున్న ఎనోచ్ ఎంక్వేతో కలిసి ఇప్పుడు పనిచేయనున్నాడు. అయితే బౌచర్ పదవీకాలం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో మాత్రం ఇంకా వివరాలు లేవు.

 

సౌత్ ఆఫ్రికా తరపున 1997లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన బౌచర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2012 లో న్యూజిలాండ్‌ పై ఆయన ఆడాడు. 15 ఏళ్ల తన కెరీర్‌లో 147 టెస్టులు ఆడిన బౌచర్ 30.30 సగటుతో 5,515 పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం ఐదు సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 125. ఇక 295 వన్డేలు ఆడిన బౌచర్ 28.57 సగటుతో 4,686 రన్స్ చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ, 26 అర్ధసెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 147 నాటౌట్. ఇక 25 టీ - 20 లాడిన బౌచర్ 17.86 సగటుతో 268 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 36 నాటౌట్. ఓవరాల్ అంతర్జాతీయ కెరీర్‌ లో 46 స్టంపింగ్‌లు చేసిన బౌచర్ మొత్తం 953 క్యాచులు అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: