భారత పేసర్ భువనేశ్వర్ గాయం తీవ్రమైందేనని తేలింది . వెస్టిండీస్ సిరీస్ కు ఇప్పటికే దూరమైన భువీ, రానున్న న్యూజిలాండ్ సిరీస్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది . వన్డే ప్రపంచ కప్ అనంతరం వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన భువీ , వెస్టిండీస్ టి -20 సిరీస్ లో పాల్గొన్న  జట్టులోకి పునరాగమనం చేశాడు . టి 20  సిరీస్ గెల్చి ఆనందం తో ఉన్న భారత్ జట్టుకు భువీ గాయం కారణంగా దూరం కావడం పెద్ద షాకేనని క్రీడాపరిశీలకులు అంటున్నారు .

 

 భువీ పూర్తిగా  ఫిట్ నెస్ తో లేకపోయినా జట్టుకు ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది . ఆటగాళ్ల గాయాల విషయం లో జట్టు మేనేజ్ మెంట్ అవలంభిస్తున్న విధానం సరిగ్గా లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి . వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సహా విషయంలోనూ మేనేజ్ మెంట్ అనుసరించిన విధానం వల్ల అతడి కెరీర్ ప్రశార్ధకంగా మారేపరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇప్పడు భువీ కూడా  పూర్తిగా ఫిట్ నెస్ లేకపోయినప్పటికీ ,   టి 20 సిరీస్ కు ఎంపిక చేయడం వల్ల  , అతడి గాయం తిరగబెట్టిందన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

భువీ కి ప్రస్తుత గజ్జల్లో గాయం అయిందని , అతడు కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది . శస్త్ర చికిత్స కూడా అవసరం అయ్యే అవకాశాలు లేకపోలేదని ఫిజియో సూచించినట్లు సమాచారం . వెస్టిండీస్ తో మూడు వన్డేలు ఆడే భారత్ జట్టు , న్యూజిలాండ్ తో సిరీస్ ఆడనుంది . ఆ తరువాత భారత ఆటగాళ్లు ఐపీల్ టి 20 టోర్నీ ఆడనున్నారు . అప్పటి వరకు భువీ కోలుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: