భారత్ క్రికెట్ లు రికార్డులు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. 16 ఏళ్ళ అతి  చిన్న వయసులోనే క్రికెట్ మొదలు పెట్టిన సచిన్ టెండూల్కర్. తన కెరీర్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అంతటి స్థాయిలో భారత్ క్రికెట్ లో ఎదిగిన వ్యక్తి అంటే విరాట్ కోహ్లీ ని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. గత దశాబ్ద కాలంలో ఎన్నో మైలురాళ్లను దాటిన్న విరాట్ కోహ్లీ.

 

ఈ రోజు జరుగుతున్న విండీస్ తో పోరులో కూడా ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నాడు. ఈ మ్యాచ్లో తన తొలి బంతికి డక్ ఔట్ అయిన  విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు సాధించాడు. భారత్ క్రికెట్ లో 400 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన 8 ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు కేవలం ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే భారత తరుపున 400 మ్యాచ్లు ఆడారు. ఈ రికార్డు సాధించి విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు.

 

 మొదటి మ్యాచ్లో అనుకోని రీతిలో ఓటమి ఎదుర్కొన్న, భారత్ రెండో మ్యాచ్ ని ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగింది. తొలి వికెట్ కి 200 పరుగులు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా సెంచరీలు నమోదు చేశారు. ఆ తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతికే వెనుదిరిగాడు.

 

ఇక అప్పటి నుంచి రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ దూకుడైన ఆటతోనే భారత్ కి మంచి స్కోర్ ని అందించారు. వీరిద్దరు దూకుడు ఆటతో భారత్ తన చివరి 10 ఓవర్లలో ఏకంగా 127 పరుగులు చేసింది. అలాగే వెస్టిండీస్ ముందు 388 పరుగులకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ మ్యాచ్ బౌలర్ల చేతిలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: