ఈ మధ్యకాలంలో స్టేజిపై కొట్టుకోడాలు.. లైవ్ షోలో తన్నుకోడాలు ఎక్కువ అయిపోయాయి. మొన్న ఈ మధ్యలో పక్క దేశంలో లైవ్ షోలో కొట్టుకున్నారు.. తన్నుకున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఓ సమావేశంలో అలానే కొట్టుకున్నారు.. తన్నుకున్నారు.. దుర్ భాషలు ఆదుకున్నారు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ సమావేశంలో గందరగోళం నెలకొంది. అయితే అక్కడే ఉన్న వారు సమావేశంలో వీరు తలపడుతున్న వీడియోని తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ఈ మధ్యకాలంలో స్టేజిపై కొట్టుకోడాలు.. లైవ్ షోలో తన్నుకోడాలు ఎక్కువ అయిపోయాయి. మొన్న ఈ మధ్యలో పక్క దేశంలో లైవ్ షోలో కొట్టుకున్నారు.. తన్నుకున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఓ సమావేశంలో అలానే కొట్టుకున్నారు.. తన్నుకున్నారు.. దుర్ భాషలు ఆదుకున్నారు. చేసారు. 

 

దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోని చుసిన మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ట్విట్టర్ వేధికగా తీవ్రంగా స్పందించాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''డీడీసీఏ ఆలౌట్ అయిందని, ఒక అవమానకరమైన డకౌట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఒకరిపై ఒకరు ఎలా దాడి చేసుకుంటున్నారో చూడండి. డీడీసీఏను వెంటనే రద్దు చేసి, కొట్లాటకు దిగిన అందరిపైనా జీవిత కాల నిషేధం విధించాలని బీబీసీఐ చీఫ్ గంగూలీ, జే షాలను కోరుతున్నా.. తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకోవాలి'' అని గంభీర్ కోరాడు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: