భారత్- ఆస్ట్రేలియా పోరంటేనే మనకు ఈడెన్ గార్డెన్స్‌ లో 2001లో జరిగిన టెస్టు గుర్తుకు వస్తుంది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్ గ ఆడిన హర్భజన్ సింగ్ ఆటతీరుతో భారత కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ముగ్దుడయ్యాడట. అప్పుడు తనకు భజ్జినీ చూసి లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ గా అన్పించిందని తాజాగా పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఒక షోలో దాదా మాట్లాడుతూ.. ఆసీస్‌ తో సిరీస్‌ కు ముందు గల పరిస్థితులను వివరించాడు.


ఆ సిరీస్ ప్రారంభమయ్యే నాటికి టెస్టుల్లో ఆసీస్ భీకరమైన జట్టుగా ఉండేదని, అప్పటికే వరుసగా 15 టెస్టులు గెలిచి జోష్ మీద ఉందని గంగూలీ తెలిపాడు. ఇక సిరీస్‌ కు కీలకమైన బౌలర్లు జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే దూరమవ్వడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయని తెలిపింది. ఆ సమయంలో జట్టులోకి వచ్చిన భజ్జీ తడాఖా చూపించాడని కితాబిచ్చాడు. 


భారత క్రికెట్‌ను మార్చే ప్రదర్శన కనబర్చిన భజ్జీని చూసి నాకు ఆక్షణంలోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్పించింది. ఆ మ్యాచ్‌లో 13 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జట్టులో పాతుకపోయిన భజ్జీ.. కుంబ్లేతో కలిసి భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఆసీస్ సిరీస్‌కు ముందు ముగ్గురు స్పిన్నర్లను పరీక్షించినా.. భజ్జీ రూపంలో మెరుగైన స్పిన్నర్ దొరికాడు’ అని దాదా అన్నాడు.


తొలి మ్యాచ్ ముంబైలో ఇండియా ఓడినప్పటికి నాలుగు వికెట్లతో భజ్జీ ఆకట్టుకున్నాడు. ఇక ఈడెన్‌లో జరిగిన రెండోటెస్టులో భజ్జీ తన విశ్వరూపం చూపించాడు. హ్యాట్రిక్ సహా ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక చెన్నైలోనూ తన జోరు చూపించడంతో భారత్ ఆ సిరీస్‌ను 2-1తో గెలుపొంది. కంగారూలను నేలకు దించింది. ఇక ఆ సిరీస్‌లో హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: