గత కొంత కాలంగా స్వదేశం లో వరస విజయాలు సాధిస్తూ తిరుగులేని జట్టు  గా దూసుకుపోతున్న టీమిండియా కు  ఈరోజు  నుండి  అసలైన పరీక్ష ఎదురుకానుంది.  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా  నేడు  భారత్ , ఆస్ట్రేలియా ల మధ్య ముంబై లోని వాఖండే  వేదికగా మొదటి వన్డే (డే/నైట్) మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు అటు బౌలింగ్ , బ్యాటింగ్ , ఫీల్డింగ్ లో సమఉజ్జివులు గా ఉండడం తో హోరాహోరి   పోరు తప్పేలా లేదు. 
 
ఇక టీమిండియా ముగ్గురు ఓపెన్లరు..   రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ , కేఎల్ రాహుల్ లు అద్బుతమైన ఫామ్ లో ఉండడం తో ఓపెన్లర్లు గా ఎవరిని పంపాలో  జట్టు యాజమాన్యానికి సమస్యగా మారింది. అయితే నిన్న మీడియా సమావేశం లో  సారథి కోహ్లీ మాట్లాడుతూ ...  ఆ  ముగ్గురు జట్టులో ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందని తెలిపాడు. దానికి తోడు నిన్న రాహుల్ గంటల సేపు ప్రాక్టీస్ చేశాడు.  సో రాహుల్ తుది జట్టులో వుండే అవకాశాలు ఎక్కువగా వున్నాయన్నమాట. ఒకవేళ రాహుల్ జట్టులోకి వస్తే రోహిత్ -ధావన్ ఓపెనర్లు గా బరిలోకి దిగనుండగా  రాహుల్ ను నాల్గో స్థానం లో పరీక్షించనున్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: