ఆస్ట్రేలియా తో జరిగిన తొలివన్డే మ్యాచ్ భారత్ జట్టు ఘోర ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ తాము అన్ని విభాగాల్లో విఫలమయ్యామని చెప్పారు . బలమైన ఆస్ట్రేలియా జట్టుతో అన్ని విభాగాల్లో రాణించలేకపోతే విజయం సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు . ఈ మ్యాచ్ లో కొన్ని సందర్భాల్లో మేము అతిజాగ్రత్తకు పోయామని , అదే తమ కొంప ముంచిందని కోహ్లీ అన్నాడు . ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుతో ఇలా ఆడాల్సి  ఉండింది కాదన్నా కోహ్లీ , టీమిండియా కోలుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు .

 

తొలివన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడిందని , ఈ మ్యాచ్ లో గెలుపు కు అన్ని విధాలుగా ఆస్ట్రేలియా జట్టు అర్హురాలని అన్నాడు . ఏ ఫార్మాట్ లో అనుభవమున్న అది ఇతర ఫార్మాట్లు ఆడేటప్పుడు ఉపయోగపడుతుందని కోహ్లీ అన్నాడు . ఒక ఆటగాడు ఏ ఫార్మాట్ లోనైనా అత్యుత్తమంగా రాణిస్తే , మిగతా ఫార్మాట్లోనూ రాణించగలడని నమ్మకం ఏర్పడుతుందని చెప్పాడు . కెఎల్ రాహుల్ ఆడుతున్న తీరు చూసి అతను వన్ డౌన్ లో రాణించగలడని అనుకున్నామని కానీ అలా జరగలేదని అన్నాడు . ఆరోజు ఆస్ట్రేలియా పై ఆధిపత్యం చలాయించలేకపోయామని కోహ్లీ తెలిపాడు . ఈ ఒక్క మ్యాచ్ ఫలితాన్ని చూసి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదని , ఇంకా అనేక ప్రయోగాలు చేస్తామని చెప్పాడు .

 

భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించి 255 పరుగులు సాధించింది . జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు సెంచరీలతో కదంతొక్కి జట్టుకు విజయాన్ని చేకూర్చారు . ఓపెనర్ వార్నర్ , పించ్ లు భారత్ బౌలర్ల  ఓపికను పరీక్షించారు . భారత్ బౌలర్ల విసిరిన బంతుల్ని పరుగులుగా మల్చుకుని జట్టును విజయపథం లో నడిపించారు 

మరింత సమాచారం తెలుసుకోండి: