ఆస్ట్రేలియా తో  ముంబయి వాంఖడే స్టేడియం లో జరిగిన తొలివన్డే లో ఘోరంగా ఓటమి పాలయిన భారత్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది . ఈ మ్యాచ్   ఇన్నింగ్స్ 44 ఓవర్ లో ఫ్యాట్ కమ్మిన్స్ విసిరిన బౌన్సర్ హెల్మెట్  తగిలి  యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్  గాయపడిన విషయం తెల్సిందే . భారత్ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయం లో రిషబ్ పంత్,  పెవిలియన్ కే పరిమితం అయ్యాడు . ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలను పార్ట్ టైం వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ భుజాన వేసుకున్నాడు .

 

కెఎల్ రాహుల్ , దేశవాళీ క్రికెట్ లోనే కాకుండా ఐపీల్ లో కూడా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించి విషయం తెల్సిందే . దాంతో గాయపడిన రిషబ్ స్థానాన్ని తాత్కాలింగా కెప్టెన్ కోహ్లీ , కెఎల్ రాహుల్ తో భర్తీ చేశాడు . అయితే రాజ్ కోట్ లో జరిగే రెండవ  వన్డే మ్యాచ్  లో పాల్గొనేందుకు జట్టు బయల్దేరగా , రిషబ్ మాత్రం జట్టు తో వెళ్లడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు . రిషబ్ కు తగిలిన గాయం తీవ్రత తెలియకపోవడం వల్ల అతన్ని 24  గంటలపాటు పర్యవేక్షణ లో ఉంచాలని వైద్యులు చెప్పారని వివరించారు .

 

ఒకవేళ గాయం తీవ్రమైంది అయితే ఈ సిరీస్ కు రిషబ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది . దీనితో రెండవ వన్డే లో రిషబ్ తుది జట్టులో ఉండేది అనుమానమేనని తెలుస్తోంది . అదే జరిగితే మరో వికెట్ కీపర్ కు ఛాన్స్ ఇస్తారా ?, లేకపోతే  కెఎల్ రాహుల్ తోనే వికెట్ కీపింగ్ చేయిస్తారా ?? అన్నది జట్టు మేనేజ్ మెంట్ తేల్చుకోవాల్సి ఉంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: