మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో  ఆస్ట్రేలియా విజయం సాధించగా రెండోమ్యాచ్ లో టీమిండియా గెలుపొందింది. దాంతో సిరీస్ 1-1 తో సమం అయ్యింది. ఇక ఈరోజు బెంగుళూరు లో ఇరు జట్ల మధ్య చివరి వన్డే జరుగనుంది. ఎలాగైనా ఈమ్యాచ్ లో గెలిచి సిరిస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు  పట్టు దలతో వున్నాయి. రెండో వన్డే కు మార్పులు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్ .. మూడో వన్డే లో జట్టులో మార్పులు చేయనుంది.  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్  అస్టోన్ టర్నర్ స్థానంలో పీటర్ హాండ్స్ కాంబ్ అలాగే ఫాస్ట్ బౌలర్ కేన్  రిచర్డ్ సన్ స్థానంలో జోష్ హేజెల్ వుడ్  లను తీసుకోనుంది. కాగా  భారత జట్టులో మనీష్ పాండే స్థానం లో గాయం కారణంగా రెండో వన్డే కు దూరమైన రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
 భారత జట్టు (అంచనా): 
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ,రాహుల్ , ధావన్ , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ /మనీష్ పాండే , జడేజా , కుల్దీప్ యాదవ్ ,సైనీ , బుమ్రా ,షమీ , 
 
ఆస్ట్రేలియా జట్టు (అంచనా) : 
 
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ ,లబుషెన్, పీటర్ హాండ్స్ కాంబ్/అస్టోన్ టర్నర్ , అలెక్స్ క్యారీ ,స్టార్క్ , జోష్ హేజెల్ వుడ్ /కేన్ రిచర్డ్ సన్ ,పాట్ కమ్మిన్స్ ,  అష్టోన్ అగార్ ,ఆడమ్ జంపా 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: