ప్రపంచ క్రికెట్ లో మరో రికార్డు నమోదైంది.. నిప్పులు చెరిగే వేగంతో బంతులేసిన ఓ బౌలర్ కొత్త రికార్డు సృష్టించాడు. అది కూడా అండర్ 19 విభాగంలో ఆడిన కుర్రాడు చరిత్ర తిరగరాశాడు. వివరాల్లోకి వెళ్తే.. అండర్-19 ప్రపంచకప్ లో శ్రీలంక సీమర్ మతీషా పతిరాణా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లసిత్ మలింగా తరహా బౌలింగ్ యాక్షన్ పోలి ఉండే రాణా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ అందుకున్నాడు.

 

175 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉండేది. 2003 వరల్డ్ కప్ లో షోయబ్ అక్తర్ 161.3కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి ఫాస్టెస్ట్ బాల్ గా ఇప్పటివరకూ కొనసాగింది.

 

అంతర్జాతీయ క్రికెట్ లో ఏ స్థాయిలోనైనా ఇదే ఫాస్టెస్ట్ బాల్ . భారత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పతి రాణా వేసిన బంతి 175 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. అయితే ఆ బంతి వైడ్ బాల్ కావడంతో ఎక్స్ ట్రా రూపంలో భారత్ కు పరుగు వచ్చింది. ఏదేమైనా రికార్డు రికార్డేగా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: