న్యూజిలాండ్ తో జరిగిన తొలి టి 20 మ్యాచ్ లో భారత్ జట్టు సమిష్టిగా రాణించిన  ఆరువికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది . న్యూజిలాండ్ జట్టు  తొలుత బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది . కెప్టెన్ కేన్  విలియమ్సన్ (51), కార్లిన్ మున్రో (59 ), రాస్ టేలర్ ( 54) లు రాణించి అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు .

 

వెటరన్ రాస్ టేలర్  కేవలం 27 బంతుల్లో మూడు ఫోర్లు , మూడు సిక్సర్లతో విరుచుకుపడి , జట్టు భారీ స్కోర్ కు దోహదపడ్డాడు . భారత్ బౌలర్లు బుమ్రా , ఠాకూర్ , చౌహాల్ , దూబే , రవీంద్ర జడేజా లు తలొక వికెట్ దక్కించుకున్నారు .   జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఆరంభంలోనే రోహిత్ శర్మ (7) వికెట్ కోల్పోయి , కష్టాల్లో పడినట్లు కన్పించింది . కానీ కెఎల్ రాహుల్ ( 56), కెప్టెన్  విరాట్ కోహ్లీ (45) లు సమయోచితంగా ఆడుతూ జట్టును విజయ లక్ష్యం వైపు  నడిపించారు . జట్టు స్కోర్ 115 పరుగుల వద్దకు చేరుకోగానే రాహుల్ ఔట్ అయ్యాడు . ఈ దశలో బ్యాటింగ్ కు క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్  (58), కెప్టెన్ విరాట్ కు జత కలిశాడు .

 

విరాట్ , శివమ్ దూబే (13) వెంటవెంటనే పెవిలియన్ కు వెనుతిరిగారు . శ్రేయాస్ అయ్యర్ తో జత కలిసిన మనీష్ పాండే (14) కలిసి జట్టును విజయాపథం లో నడిపించారు . శ్రేయాస్ వీరవిహారం చేసి కేవలం 29 బంతుల్లో ఐదు ఫోర్లు , మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డారు . సోది బౌలింగ్ లో రాణించి రెండు వికెట్లు చేజిక్కించాడు .  

మరింత సమాచారం తెలుసుకోండి: