ఈ ఐపీఎల్ సీజన్  కోసం గత ఏడాది  డిసెంబర్ లో ఆటగాళ్ల వేలం జరిగిన విషయం తెలిసిందే.  ఈవేలంతో ప్రస్తుతం అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా జరిగిన సమావేశంలో ఐపీఎల్ పాలక మండలి  కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం ముగిశాఖ మీడియా తో ఆ వివరాలు  వెల్లడించాడు బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ.  అందులో భాగంగా ఈ ఐపీఎల్ ఇంతకుముందు సీజన్లలా  కాకుండా కొంచెం ముందుగానే  స్టార్ట్ కానుంది. మార్చి 29న  ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ అయ్యి మే 24తో ముగియనుంది. అలాగే ముంబై లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ చరిత్రలో మంబై లో ఫైనల్ జరుగనుండడం ఇది నాల్గో సారి. ఇక  రాత్రి వేళల్లో జరిగే మ్యాచ్ ల సమయాల్లో మార్పు ఉండదని  ఈసీజన్ ఐపీఎల్ మ్యాచ్ లు కూడా  యధావిధిగా  రాత్రి 8 గంటలకే స్టార్ట్ అవుతాయని గంగూలీ వెల్లడించాడు.  
 
 ఐపీఎల్ మ్యాచ్ లను 8గంటలకు  కాకుండా 7 గంటలకు స్టార్ట్ చేయాలని కొన్ని నెలలు గా లీగ్ ప్రసార  హక్కులను సొంతం చేసుకున్న స్టార్  స్పోర్ట్స్  ,బీసీసీఐ పై ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఐపీఎల్ ప్రాంఛైజీలు ఇందుకు ఒప్పుకోలేదు. దాంతో బీసీసీఐ కూడా ప్రాంఛైజీల నిర్ణయానికే  ఓటు వేసింది.  ఇక అలాగే  రెండు మ్యాచ్ లున్న రోజులను  కుదించాం. 5రోజులే(సాయంత్రం 4గంటలు ,రాత్రి 8గంటలు ) ఈ మ్యాచ్ లు  జరుగనున్నాయి. ఇక మొదటి సారి ఈ సీజన్లో కంకషన్ సబ్ స్టిట్యూట్  ను ప్రవేశపెడుతున్నాం. నో బాల్ ను మూడో ఎంపైర్ నిర్ణయిస్తాడు.  ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆల్ స్టార్స్ పేరిట ఛారిటీ మ్యాచ్  నిర్వహించనున్నాం. ఇందులో స్టార్ ప్లేయర్లు పాల్గొననున్నారు. అయితే ఆ మ్యాచ్ వేదికను ఇంకా నిర్ణయించలేదని గంగూలీ  పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: