సౌతాఫ్రికా జట్టు పరిస్థితి రోజు రోజు కు దారుణంగా  తయారువుతుంది. విదేశాల్లోనేకాదు  సొంత గడ్డ పై కూడా అవమానకర రీతిలో  ఓడిపోయి అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. తాజాగా  జోహెనెస్ బర్గ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గో టెస్టు లో 191 పరుగుల తేడాతో  ఓటమి చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 400పరుగులకు ఆల్ ఔట్  కాగా సౌతాఫ్రికా 183పరుగులకే కుప్పకూలింది. 
 
అయితే ఫాలో ఆన్ ఇవ్వకుండా  ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 248పరుగులకు ఆల్ అవుట్ అయ్యి ప్రొటీస్  ముందు  భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం సౌతాఫ్రికా  రెండో ఇన్నింగ్స్ లో 274పరుగులకు ఆల్ ఔటై పరాజయం పాలైయింది. అయితే  ఆజట్టు కేవలం ఓటమి తో సరిపెట్టుకోలేదు. స్లో ఓవర్ రేట్  కారణంగా ఐసీసీ రూల్స్ ప్రకారం  మ్యాచ్ రిఫరీ  దక్షిణాఫ్రికా ఆటగాళ్ల అందరికి  మ్యాచ్ ఫీజ్ లో 60శాతం  ఫైన్ వేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్  పాయింట్లలో 6పాయింట్ల కోత విధించాడు. 
 
 ఈటెస్టు విజయం తో ఇంగ్లాండ్  నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-1 తేడాతో తో కైవసం చేసుకుంది. మార్క్ వుడ్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా స్టోక్స్ ను  మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది.  ఇక నాల్గో టెస్టు అనంతరం సౌతాఫ్రికా వెటరన్ ఫాస్ట్ బౌలర్ వెర్నర్ ఫిలాండర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: