పరిమిత ఓవర్ల క్రికెట్ లో  ఓపెనర్ గానే కాకుండా ఏ స్థానం లోనైనా బ్యాటింగ్ చేస్తూ  సూపర్ ఫామ్  తో  అదరగొడుతున్న టీమిండియా యువ ఆటగాడు కేఎల్ రాహుల్  బ్యాట్స్ మెన్ గానే కాదు  వికెట్ కీపర్ బాధ్యతలను  కూడా సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ  శభాష్ అనిపించుకుంటున్నాడు.  ఇక  ఈ ఒక్క నెలలోనే రాహుల్ మూడు సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లు  అందుకున్నాడు. అందులో భాగంగా  జనవరి 7న సొంత గడ్డపై  శ్రీలంక తో జరిగిన  రెండో టీ 20 లో  ఈఏడాది తన మొదటి  మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ను అందుకున్నాడు. ఈమ్యాచ్ లో రాహుల్  45 పరుగుల తో సత్తాచాటాడు. 
 
ఆతరువాత ఆస్ట్రేలియా తో జరిగినరెండో వన్డే లో 80 పరుగులచేసి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. దాంతో ఈఏడాది వన్డే , టీ 20 ల్లో మొదటి  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు  గెల్చుకున్న  టీమిండియా క్రికెటర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇక మూడవది  తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన  రెండో టీ 20  లో గెలుచుకున్నాడు. ఈమ్యాచ్ లో అతను  57పరుగులతో అజేయం గా నిలిచాడు. మరి రేపు  కివీస్ తో జరుగనున్న మూడో టీ 20లోకూడా రాహుల్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: