న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో  టీ 20 లో నిర్ణీత 20 ఓవర్ల లో 5వికెట్ల నష్టానికి భారత్ 179పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి  బ్యాటింగ్ దిగిన భారత్ కు ఓపెనర్లు  రాహుల్ , రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చారు. రాహుల్  స్ట్రైక్ రొటేట్ చేయగా  రోహిత్  ఫోర్లు ,సిక్సర్ల తో చెలరేగిపోయాడు.   ఈక్రమం లో  6ఓవర్లోనే   రోహిత్  అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఒకానొక దశ లో భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే 9ఓవర్ లో రాహుల్(27) వెనుదిరగడం తో వికెట్ల పతనం స్టార్ట్ అయ్యింది.

 

ఆతరువాత రోహిత్ (65),శివమ్ దూబే (3) వెను వెంటనే పెవిలియన్ చేరగా శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే 17 పరుగుల  వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్ కు యత్నించి అయ్యర్ అవుట్ అయ్యాడు.  కోహ్లీ (38) కూడా  వేగంగా ఆడలేకపోయాడు. చివరి ఓవర్ లో  మనీష్ పాండే , జడేజా చెరో సిక్సర్ కొట్టడం తో భారత్ కష్టం మీద  179 పరుగులు చేసింది. 

 

ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన  న్యూజిలాండ్ 4ఓవర్ల లో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ,సిరీస్ ఆశలు సజీవంగా వుంచుకోవాలనుంటే ఈమ్యాచ్ లో తప్పక విజయం సాదించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: