గత కొంత కాలంగా స్వదేశంలో వరస  విజయాల తో దూసుకుపోతున్న టీమిండియా  తాజాగా విదేశీ గడ్డపై కూడా వరస విజయాలను సాధిస్తూ ఇంట కాదు బయట కూడా తామేంటో నిరూపించింది. అందులో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న 5మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిలిగి ఉండగానే 3-0 తో గెలుచుకుంది. ఇక టీమిండియా ద్రుష్టి ఇప్పుడు  క్లీన్ స్వీప్ పై పడింది. ఎలాగైనా  సిరీస్ ను 5-0 తో వైట్ వాష్  చేసి న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్  తరువాత  మిగితా రెండు  మ్యాచ్ లకు కూడా అదే జట్టుతో  బరిలోకి  దిగిన  భారత్..  నాల్గో టీ 20 లో మాత్రం మార్పులు చేయనుంది. ఈ విషయాన్ని మూడో టీ 20 ముగిసిన అనంతరం స్వయంగా కోహ్లీనే వెల్లడించాడు. సిరీస్ గెలవడం ఆనందానిచ్చింది . ఇక వాషింగ్టన్ సుందర్ , నవదీప్ సైని లాంటి యువ ఆటగాళ్లకు మిగితా మ్యాచ్ ల్లో అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం ఇందుకు  వారు అర్హులు అని కోహ్లీ పేర్కొన్నాడు.  సో  నాల్గో టీ 20 లో  మార్పులు జరగడం ఖాయం.
 
తదుపరిమ్యాచ్ కు ఒకవేళ సుందర్ ను తీసుకోవాలనుకుంటే చాహల్ తప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆల్ రౌండర్ శివమ్ దూబే స్థానంలో  రిషబ్ పంత్ ,సంజు సాంసన్ లలో  ఒకరు జట్టులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక మూడో టీ 20లో  తీవ్రంగా నిరాశపర్చిన  బుమ్రా ను పక్కకు పెట్టి సైని ని తీసుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు. శుక్రవారం ఇరు జట్ల మధ్య నాల్గో టీ 20 జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: