గత ఏడాది ముందు వరకు ఎక్కువ టెస్టులకే పరిమితమైన  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గడిచిన  కొన్ని నెలలుగా  పరిమిత ఓవర్ల క్రికెట్ లో కూడా  రెగ్యులర్ గా స్థానం సంపాదించుకుంటూ  సుస్థిర స్థానం పై కన్నేశాడు. ముఖ్యంగా గత ఏడాది ప్రపంచ కప్ లో న్యూజిలాండ్  తో సెమిస్ లో జడేజా ఆడిన ఇన్నింగ్స్  తన కెరీర్ కు చాలా హెల్ప్అయ్యింది.  అప్పటి  నుండి  ఈ ఆల్ రౌండర్ మూడు ఫార్మాట్ లలో చోటు సంపాదించుకుంటున్నాడు.  
 
ఇక తాజాగా కివీస్ తో జరుగుతున్న టీ 20సిరీస్ లో జడేజా అదరగొడుతున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ అవసరమైన  సమయం లో వికెట్లు తీస్తూ జట్టు విజయం లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు  జరిగిన  మూడు మ్యాచ్ ల్లో  తను వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి  వికెట్ తీస్తూ వచ్చాడు జడేజా. అందులో భాగంగా మొదటి టీ 20 లో జడేజా 13ఓవర్ లో  బౌలింగ్ కు దిగగా ఆ ఓవర్ రెండో బంతికి డి గ్రాండ్ హోమ్ ను అవుట్ చేశాడు అలాగే రెండో మ్యాచ్ లో 11ఓవర్  లో బౌలింగ్ కు రాగ ఆ ఓవర్ రెండో బంతికి  మళ్ళీ డి గ్రాండ్ హోమ్ నే  అవుట్ చేశాడు. ఇక మూడో  మ్యాచ్ లో 7ఓవర్ కు బౌలింగ్ కు వచ్చిన జడేజా ఆ ఓవర్ రెండో బంతికి  మున్రో ను అవుట్ చేశాడు. అలా జడేజా  వరసగా మూడు మ్యాచ్ ల్లో మొదటి ఓవర్ రెండో బంతికి  వికెట్ ను తీసి రికార్డు సృష్టించాడు. బహుశా  మరో బౌలర్ ఈఫీట్ ను రిపీట్ చేయలేడేమో... 

మరింత సమాచారం తెలుసుకోండి: