ఆదివారం కివీస్ తో జరిగిన చివరి టీ 20లో 7పరుగుల తేడాతో  భారత్ విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20ఓవర్ల లో మూడు వికెట్ల నష్టానికి 163పరుగులు చేయగా లక్ష్య ఛేదన లో న్యూజిలాండ్  9వికెట్లు కోల్పోయి 156పరుగులకు మాత్రమే పరిమితమై మరో ఓటమిని చవి చూసింది. 4ఓవర్ల లో కేవలం 12పరుగులు మాత్రమే  ఇచ్చి 3వికెట్లు  తీసిన  టీమిండియా స్టార్  పేసర్ బుమ్రా కు ప్లేయర్ ఆఫ్  ది మ్యాచ్  దక్కగా సిరీస్ ఆద్యాంతం అద్భుతంగా రాణించిన కీపర్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.  

రాహుల్ మొత్తం 5మ్యాచ్ ల్లో కలిపి  రెండు  హాఫ్ సెంచరీలతో 224 పరుగులు చేసి  సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక  5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో సొంత గడ్డపై  భారత్  చేతిలో న్యూజిలాండ్ మొదటి సారి వైట్ వాష్ కు గురైంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్  ఈనెల 5వ తేదీన ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: