కేఎల్ రాహుల్... భారత జట్టులో ఎంతో నైపుణ్యంతో కూడిన టెక్నికల్ బ్యాట్స్ మెన్ . ఎలాంటి ఒత్తిడి లోనైనా తనదైన టెక్నికల్  షాట్స్  ఆడుతూ భారీ స్కోరు నమోదు చేయగలరు కేఎల్ రాహుల్. ప్రస్తుతం ఫార్మాట్ ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... బౌలర్ ఎంత ఘనుడైన  ...తనదైన  స్టైల్ బ్యాటింగ్ తో అదరగొడుతు భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు కె.ఎల్.రాహుల్. ఓవైపు కీపర్గా సమర్ధవంతంగా బాధ్యతలు చేపడుతునే  మరోవైపు ఓపెనర్గా జట్టు కు అదిరిపోయే ఓపెనింగ్ స్కోరును ఇస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ పర్ఫామెన్స్ చూసినవారందరూ ఔరా  అనక మానరు. ఇక ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్ ను ముగించుకొని క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 వరుసగా 3 టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా అప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్నప్పటికీ క్లీన్స్వీప్ చేయాలనే పట్టుదలతో ముందుకి సాగి  కివీస్ జట్టు కు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గేందుకు అవకాశం కల్పించలేదు. ఇక ఈ ఐదు మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు అనే చెప్పాలి. న్యూజిలాండ్తో జరిగిన ఐదు టి20లో అద్భుతమైన ప్రదర్శన చేసిన కె.ఎల్.రాహుల్ ఏకంగా రికార్డుల రారాజు అయినా కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు కేఎల్ రాహుల్. 

 

 

 న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టి20 మ్యాచ్ లో 45 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్. మొత్తంగా ఐదు టి20 సిరీస్ లో 224 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఒక టి20 సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు కేఎల్ రాహుల్. అంతకుమునుపు రికార్డు టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. 2016 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో కోహ్లీ 199 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో కె.ఎల్.రాహుల్ 224 పరుగులు చేసిన కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టి తన పేరు లికించుకున్నాడు. అంతేకాకుండా ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: