తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన  టీ 20 సిరీస్ .. టీమిండియా యువ  ఓపెనర్ కేఎల్ రాహుల్ కు చిరకాలం గుర్తిండిపోతుందనడం లో సందేహం అవసరం లేదు. కేవలం ఈ సిరీస్ లో అతను బ్యాట్స్ మెన్ గానే కాదు  కీపర్  గా అలాగే చివరి  టీ 20లో  కెప్టెన్  రోహిత్ శర్మ గాయపడడం తో తన స్థానం లో  కెప్టెన్సీ  చేసి కూడా సక్సెస్  అయ్యాడు.  దాంతో  రాహుల్  భవిష్యత్తులో కాబోయే  కెప్టెన్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. 
 
ఇక ఈసిరీస్ లో రాహుల్ పలు రికార్డులు సృష్టించాడు. అందులో భాగంగా ఈ సిరీస్ లో 5మ్యాచ్ ల్లో రెండు  హాఫ్ సెంచరీలతో కలిపి  రాహుల్ మొత్తం  224 పరుగులు చేశాడు.  తద్వారా  ద్వైపాక్షిక టీ 20సిరీస్ లో అత్యధిక  పరుగులు చేసిన మొదటి భారత ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. అలాగే మొదటి రెండు టీ 20ల ద్వారా  వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన  మొదటి  భారత వికెట్ కీపర్ కూడా అతనే కావడం విశేషం.
 
ఇక  ఓపెనర్ గా టీ 20ల్లో  వేగంగా 1000పరుగులు పూర్తి చేసిన ఘనతను కూడా సాదించాడు అలాగే  టీ 20 ల్లో ఓ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతనే అంతేకాదు టీ 20ల్లోమొదటి ప్లేయర్ ఆఫ్  ది సిరీస్ అవార్డు ను గెలుచుకున్న మొదటి భారత వికెట్ కీపర్ గా కూడా రాహుల్  రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఈసిరీస్ రాహుల్ కెరీర్ కు చాలా ఉపయోగపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: