గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరుగనున్న  వన్డే , టెస్టు సిరీస్ లనుండి  టీమిండియా  స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో అతని స్థానంలో బీసీసీఐ, వన్డే లకు మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసింది అయితే పృథ్వీ షా కూడా  చోటు దక్కించుకోవడంతో రాహుల్ తో కలిసి పృథ్వీ ఓపెనింగ్ చేసే  ఛాన్స్ ఎక్కువగా వుంది.  ఇక  కివీస్ తో జరుగనున్న రెండుటెస్టు లకు కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 
 
పృథ్వీ షా మళ్ళీ టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా శుభమన్ గిల్ , నవదీప్ సైని  లు కూడా చోటు దక్కించుకున్నారు. ఇక  గాయం కారణంగా  ఇషాంత్ శర్మ  అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది అయితే టెస్టు సిరీస్ లోగా  ఇషాంత్ పూర్తిగా కోలుకుంటే అతను కూడా జట్టులో ఉంటాడని బీసీసీఐ  వెల్లడించింది. కాగా రేపటి నుండి న్యూజిలాండ్ , ఇండియా మధ్య మూడు వన్డే ల సిరీస్ ప్రారంభం కానుంది. 
 
భారత జట్టు (వన్దే ) : 
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,రాహుల్ ,పృథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , శివమ్ దూబే , మనీష్ పాండే , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా ,  శార్దూల్ ఠాకూర్  ,షమీ ,రవీంద్ర జడేజా ,కేదార్ జాదవ్,మయాంక్ అగర్వాల్ 
 
టెస్టు జట్టు : 
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,పృథ్వీ షా , మయాంక్ అగర్వాల్ ,రిషబ్ పంత్ , పుజారా  , రహానే , సాహా ,హనుమ విహారి ,అశ్విన్ , బుమ్రా ,షమీ , ఉమేష్ యాదవ్ ,రవీంద్ర జడేజా ,గిల్ , సైని ,ఇషాంత్ శర్మ ( ఫిట్ గా ఉంటే ) 

మరింత సమాచారం తెలుసుకోండి: