మొన్నటి వరకు అతని కెరీర్ పేలవంగానే సాగింది.. జట్టులో స్థానం ఉంటుందా ఊడుతుందా అనే అనుమానం కూడా ఉండేది... కానీ ఇప్పుడు మాత్రం టీమ్ ఇండియా ఏ  మ్యాచ్ ఆడిన అతని పేరు కీలకంగా వినిపిస్తోంది. అతని ఆట తీరు మహా అద్భుతం... ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నాడు. టీం ఇండియాను విజయాలకు చేరువ చేస్తున్నారు. ఆ ఆటగాడు ఎవరో కాదు  కేఎల్ రాహుల్. ప్రస్తుతం గత కొంతకాలంగా టీమిండియా విజయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కె.ఎల్.రాహుల్ . ఇండియాలో స్టార్ ఓపెనర్ కానేకాదు మిడిలార్డర్లో కూడా తన సత్తా చాటుతూ అద్భుత  బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. 

 

 

 ఇక తాజాగా  న్యూజిలాండ్తో జరిగిన ఐదు టి20 ల  సిరీస్ లో కూడా... రాహుల్ తన సత్తా చాటాడు. ముఖ్యంగా కె.ఎల్.రాహుల్ ఈ మధ్య కొత్త బాధ్యతను కూడా చేపట్టాడు. ఓవైపు కీపర్గా వికెట్ల వెనకాల ఉండి  ఎంతో చలాకీగా ఫీల్డింగ్ చేస్తూనే... ఇండియాలో ఓపెనర్గా  భారీ స్కోరును నమోదు చేశాడు. ముఖ్యంగా సూపర్ ఓవర్ లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను విజయం వైపు నడిపించాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో కీ ప్లేయర్  గా మారిపోయాడు కె.ఎల్.రాహుల్. కొంతకాలంగా అందరు స్టార్ బ్యాట్ మెన్స్  బోల్తా కొట్టి పెవిలియన్ చేరినప్పటికీ... కేఎల్ రాహుల్ మాత్రం ఆడుకుంటున్నాడు. 

 

 

 అయితే న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ లో స్థానం కోసం ఎంతో ఆశగా ఎదురుచూశాడు కేఎల్ రాహుల్.కానీ  కేఎల్ రాహుల్ కు నిరాశే ఎదురయింది. న్యూజిలాండ్తో జరిగే టేస్ట్ సిరీస్లో తుది జట్టులో కేఎల్ రాహుల్ కు స్థానం కల్పించలేదు టీమ్ ఇండియా సెలెక్టర్లు. కేఎల్ రాహుల్ ని కాదని శుబ్ మన్ గిల్ కు  టెస్ట్ సిరీస్ తుది జట్టులో  అవకాశం  కల్పించారూ... అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఛాన్స్  కల్పించినట్లు తెలుస్తోంది. అటు  టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు  కూడా టెస్ట్ సిరీస్లో అవకాశం దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: