న్యూజిలాండ్ తో జరిగిన 5టీ 20ల సిరీస్ ను  క్లీన్ స్వీప్ చేసిన  టీమిండియా  రేపటి నుండి జరిగే  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్  పై కూడా  కన్నేసింది.  అందులో భాగంగా రేపు  ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరుగనుంది. ఇక ఈసిరీస్ కు భారత స్టార్ ఓపెనర్లు శిఖర్ ధావన్ , రోహిత్ శర్మ  దూరం కావడంతో ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే  తాజాగా కోహ్లీ  దీని పై క్లారిటీ ఇచ్చాడు. యువ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా రేపటి మ్యాచ్ తో వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని దాంతో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపెనర్లుగా రానున్నారని  వెల్లడించాడు.
 
అలాగే  టాప్ ఫామ్ లో  వున్న  ఓపెనర్ కమ్ కీపర్ కేఎల్ రాహుల్  మిడిల్ ఆర్డర్ లో  బ్యాటింగ్ కు వస్తాడని  కోహ్లీ పేర్కొన్నాడు.  రాహుల్ ను మేము మిడిల్ ఆర్డర్ లో చూడాలనుకుంటున్నాం అందుకే ఈసిరీస్ లో  అతను ఆ స్థానం లోనే బ్యాటింగ్ చేస్తాడు అలాగే కీపర్ గా కూడా అతనే కొనసాగుతాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 
 
ఇక రాహుల్ కీపర్ గా కూడా ఛాన్స్ కొట్టేయడం తో రెగ్యులర్ కీపర్ గా ఎంపికైన  రిషబ్ పంత్  పరిస్థితి  అగమ్యగోచరంగా  మారింది. గత 5టీ 20ల సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా  అవకాశం దక్కించులేదు మరి వన్డే సిరీస్ లోనైనా  అవకాశం వస్తుందనుకుంటే తాజాగా కోహ్లీ చేసిన  వ్యాఖ్యలు  బట్టి చూస్తే పంత్ కు  ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: