న్యూజిలాండ్‌లోని హ‌మిల్ట‌న్‌లో సెడాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవ‌ర్ల‌లో ఇండియా 4 వికెట్లు న‌ష్ట‌పోయి 347 ప‌రుగులు సాధించింది. బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేశాడు. 101 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

 

వన్డేల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోవడం శ్రేయాస్‌‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే.. సెంచరీ అనంతరం సౌతీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయాస్ శాంట్నర్‌కు క్యాచ్‌గా చిక్కడంతో ఔటయ్యాడు. 107 బంతుల్లో 103 పరుగులు చేసి మంచి ఆటతీరుతో శ్రేయాస్ ఆకట్టుకున్నాడు. 

 

ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు ఇండియా బ్యాట్స్‌మెన్స్ చుక్క‌లు చూపించారు. ఓపెనర్లు పృథ్వీ షా 20, మ‌యూంక్ అగ‌ర్వాల్ 32 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. శ్రేయాస్ అయ్య‌ర్ 103 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. లోకేష్ రాహుల్ 88, కేదార్ జాద‌వ్ 26 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టీమ్ సౌతీ 2 వికెట్లు, ఇసా సోథీ 1 వికెట్ ప‌డ‌గొట్టారు. 

 

348 ప‌రుగుల భారీ టార్గెట్‌తో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో న్యూజిలాండ్‌కు ఈ బిగ్ టార్గెట్ చేధించ‌డం క‌ష్ట‌మే అవుతుంది. ఇప్ప‌టికే ఐదు 20 - 20 మ్యాచ్‌ల సీరీస్‌ను టీం ఇండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగ‌తి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: