హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డే లో టీమిండియా కు దెబ్బ మీద దెబ్బ పడింది. ఈమ్యాచ్ లో భారీ స్కోర్ చేసినా  ఓడిపోయామని  బాధలో వున్న టీమిండియా ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ షాక్ ఇచ్చాడు.  న్యూజిలాండ్  బ్యాటింగ్ చేస్తున్న సమయంలో  స్లో ఓవర్ రేట్ కు పాల్పడడంతో భారత ఆటగాళ్లకు మ్యాచ్  ఫీజు లో 80శాతం కోత విధించారు.  ఇంతకుముందు  కివీస్ తో జరిగిన 5టీ 20ల సిరీస్ లో కూడా రెండుమ్యాచ్ ల్లో  స్లో ఓవర్  రేట్  కారణంగా భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు లో కోత పడింది. 
 
ఇక హామిల్టన్ వన్డే లో మొదట బ్యాటింగ్ చేసిన  భారత్ .. నిర్ణీత 50ఓవర్ల లో 4వికెట్ల నష్టానికి 347పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఎలాంటి తడబాటు లేకుండా  48.1ఓవర్ల లో 6వికెట్లు కోల్పోయి  విజయకేతనం ఎగురవేసింది. రెగ్యులర్  కెప్టెన్  విలియమ్సన్ మ్యాచ్ కు దూరమైన  తాత్కాలిక కెప్టెన్  టామ్ లేతమ్(69) తో కలిసి  వెటరన్ బ్యాట్స్ మెన్  రాస్  టేలర్(109) మ్యాచ్ ను గెలిపించాడు. వీరికి తోడు ఓపెనర్ హెన్రీ నికోల్స్ కూడా 78పరుగులతో రాణించాడు.  కాగా శతకంతో  గెలుపు లో కీలక పాత్ర పోషించిన టేలర్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  ఈవిజయం తో మూడు వన్డే ల సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: