గత రెండు సీజన్లలలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్  యువ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ ఐపీఎల్ కుదూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా  ఆర్చర్ మోచేతికి గాయం కావడంతో సౌతాఫ్రికా తో జరుగనున్న టీ20 సిరీస్ తోపాటు శ్రీలంక తో జరుగనున్న టెస్టు సిరీస్  కు అలాగే ఈఏడాది ఐపీఎల్ కు కూడా అతను దూరమయ్యాడు. గాయం తీవ్రమైంది కావడంతో  ఆర్చర్ కు రెండు నెలలు విశ్రాంతి  అవసరమని వైద్యులు సూచించారు. 
 
దాంతో ఈ సీజన్ ఆరంభానికి ముందే రాజస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాజస్థాన్ యాజమాన్యం మాత్రం ఆర్చర్ ఐపీఎల్ లోపు పూర్తిగా కోలుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేసింది. ఒకవేళ  ఆర్చర్  ఈ సీజన్ కు పూర్తిగా దూరమైతే రాజస్థాన్ కు  గట్టి దెబ్బ పడ్డట్లే.  మార్చి 29నుండి  ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. 
 
రాజస్థాన్ రాయల్స్ : 
 
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్),సంజు శాంసన్ , బెన్ స్టోక్స్ ,జాస్ బట్లర్ (కీపర్ ),మనన్ వోహ్రా ,రియాన్ పరాగ్ ,వరుణ్ ఆరోన్ ,శ్రేయాస్ గోపాల్  , జోఫ్రా ఆర్చర్ ,శశాంక్ సింగ్ ,మహిపాల్ లొమ్రోర్ ,అంకిత్ రాజ్ పుత్ ,రాహుల్ తేవాటియా ,జయదేవ్ ఉనద్కట్ ,రాబిన్ ఉతప్ప ,మయాంక్ మార్కండే ,ఒషానే థామస్ ,అనుజ్ రావత్ ,యశస్వి జైస్వాల్ ,కార్తీక్ త్యాగి,డేవిడ్ మిల్లర్ ,ఆకాష్ సింగ్ ,అనిరుద్ధ జోషి

మరింత సమాచారం తెలుసుకోండి: