న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో టీమిండియా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే దాంతో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే  శనివారం జరిగే  రెండో మ్యాచ్ లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి...  బ్యాటింగ్  విభాగం లో ఎలాంటి సమస్య లేకున్నా బౌలింగే భారత్ ను కలవరపెడుతుంది.  గత మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినా బౌలర్లు  దాన్ని కాపాడలేకపోయారు. ముఖ్యంగా స్పిన్నర్  కుల్దీప్ యాదవ్ , ఫాస్ట్ బౌలర్  శార్దూల్ ఠాకూర్  తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో  రెండో వన్డే లో వారి స్థానాల్లో యుజ్వేంద్ర చాహల్ ,నవదీప్ సైని  తీసుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు. 
 
ఇక  మొదటి మ్యాచ్ గెలుపుతో కివీస్ రెండో వన్డే కోసం రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.  ఈమ్యాచ్ కోసం న్యూజిలాండ్ కూడా తుది జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేసే అవకాశం వుంది.  అయితే ఆక్లాండ్ లో జరుగనున్న ఈ మ్యాచ్  కు వరణుడి  గండం కూడా వుంది. శనివారం అక్కడ 50శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  దాంతో మ్యాచ్ కు అంతరాయం తప్పకపోవచ్చు. 
 
తుది జట్లు (అంచనా) :
 
భారత్ : విరాట్ కోహ్లీ (కెప్టెన్) , మయాంక్ అగర్వాల్  ,పృథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , రాహుల్ (కీపర్), జాదవ్, రవీంద్ర జడేజా ,కుల్దీప్ యాదవ్ /చాహల్ ,సైని/శార్దూల్ ఠాకూర్, బుమ్రా  ,షమీ 
 
న్యూజిలాండ్ :  గప్తిల్ ,హెన్రీ నీకోల్స్ , టామ్ లేతమ్ (కెప్టెన్/కీపర్), టేలర్,గ్రాండ్ హోమ్ ,మార్క్ చాంప్మన్/బ్లండెల్ ,నీశమ్ , సాన్ ట్నర్  , సౌథీ ,ఇష్ సోడి ,కూగ్ లైన్/బెన్నెట్  
 

మరింత సమాచారం తెలుసుకోండి: