ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తుగా ఓడిస్తు  సిరీస్ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది టీమిండియా జట్టు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు మొన్నటికి మొన్న కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ లను అలవోకగా గెలిచి న్యూజిలాండ్ సొంతం గడ్డపైనే క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాపై ఎన్నో ప్రశంసల జల్లు కురిసింది. కానీ తాజాగా న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లు మాత్రం న్యూజిలాండ్లో టీమిండియా విజయాలకు బ్రేక్ పడిందని చెప్పాలి. మొదటి వన్డేలో 347 భారీ పరుగులు న్యూజిలాండ్ ముందు టార్గెట్ పెట్టినప్పటికీ... టీమిండియా బౌలర్లు ఫీల్డింగ్ వైఫల్యాల కారణంగా న్యూజిలాండ్ విజయం సాధించిందని చెప్పవచ్చు. అయితే గతంలో టి20 సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత జట్టు ఉదాసీనత ప్రదర్శించినట్లు గత మ్యాచ్లో అనిపించింది. 

 

 దీంతో రెండో వన్డే మ్యాచ్ కోసం సరికొత్త వ్యూహాలతో టీమిండియా బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో భారత్ కి డూ ఆర్ డై మ్యాచ్ లా మారిపోయింది రెండో వన్డే మ్యాచ్. రెండో వన్డే మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను పై ఆశలు సజీవంగా ఉంటాయి భారత్ కి . అటు  కివీస్ జట్టు కూడా మొదటి విజయం ఉత్సాహంతో రెండో విజయం కూడా సొంతం చేసుకొని సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఓ సెంటిమెంటు ఉంది. గతేడాది టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్ను గెలుచుకున్నది.  మరి ఈ ఏడాది పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ను తన ఖాతాలో వేసుకున్న భారత్... పోయిన ఏడు  జరిగిన లెక్కను  సమం కాకుండా ఉండాలంటే కోహ్లీ బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో  వన్డే సిరీస్ను కూడా గెలుచుకోవాల్సి  ఉంటుంది. నేడు ఈ రెండు జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. 

 

 అయితే ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ పరంగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ.. బౌలింగ్ ఫీల్డింగ్ విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీమిండియాలో అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రా కూడా గత వన్డే మ్యాచ్లో పేలవ  ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే గత మ్యాచ్లో ఆరో స్థానంలో కేదార్ జాదవ్ బాగానే ఆడినప్పటికీ అతని బ్యాటింగ్ పై మళ్ళీ సందేహాలు వస్తున్న నేపథ్యంలో జాదవ్ కంటే ఎక్కువ మనీష్ పాండే మేలు  అని నమ్మి అతనికి రెండో వన్డేలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు కివీస్ జట్టులో  కూడా పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. మరి నేడు జరగబోతున్న రెండో వన్డే మ్యాచ్లో... భారత్ గెలిచి సిరీస్ పై ఆశలు సజీవం చేసుకుంటుందా లేక... కివీస్  సత్తా చాటి పరువు నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: